విద్యుత్ లైన్‌ను ఢీకొని ఓహియో నదిలో కూలిపోయిన సీప్లేన్.. ఇద్దరు వ్యక్తులకు గాయాలు...

ఆకాశంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

 A Seaplane Crashed Into The Ohio River After Hitting A Power Line Two People Wer-TeluguStop.com

అయితే అమెరికాకి( america ) చెందిన ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.వివరాల్లోకి వెళ్తే, శనివారం నాడు ఓహియో నది నుంచి బయలుదేరిన సీప్లేన్ ఓ విద్యుత్ లైన్‌కు తగిలింది.

అనంతరం కంట్రోల్ తప్పి ఒక్కసారిగా నీటిలో పడింది.దాంతో విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.72 ఏళ్ల పైలట్, అతని 67 ఏళ్ల ప్యాసింజర్ మునిగిపోతున్న విమానం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకోగలిగారు.ఇద్దరికీ స్వల్పగాయాలు కావడంతో మాగ్రుడర్ హాస్పిటల్ కు తరలించారు.

వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని బయటికి వెల్లడించారు.

ఓహియో ఎడిసన్ కార్మికులు( Ohio Edison workers ) సంఘటనా స్థలానికి స్పందించి, పడిపోయిన హై-వోల్టేజీ విద్యుత్ లైన్‌ను ఆపివేశారు.విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలోని దాదాపు 1500 మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.ఇప్పటికే ఈ ప్రాంతాల్లో మళ్ళీ ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసినట్లు సమాచారం.

నది నుంచి విమానాన్ని తొలగించడానికి రెస్క్యూ కంపెనీని పిలిచారు.ఓహియో స్టేట్ హైవే పెట్రోల్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి.

సీప్లేన్ సీప్లేన్స్ ఆర్ ఫన్ ఎల్ ఎల్ సీ అనే కంపెనీకి చెందినది.దీని పేరు 2003 సెస్నా 206 సీప్లేన్.

ఇది శనివారం సాయంత్రం 4 గంటల తర్వాత ఒట్టావా కౌంటీలోని పోర్ట్ క్లింటన్ వెలుపల పోర్టేజ్ నది మీదుగా తూర్పు వైపుకు వెళుతోంది.క్రాష్ గురించిన ప్రశ్నలకు కంపెనీ సమాధానం ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube