ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు.ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల ఫైనల్ జాబితాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దాదాపు ఈ లిస్టు ఫైనల్ అయింది.విడుదలే చేయాల్సి ఉంది.
అసెంబ్లీ టికెట్ ఇవ్వని కొంతమందికి ఎంపీ టికెట్ జగన్( CM YS JAGAN ) కేటాయించినట్లు సమాచారం.ఎంపీ అభ్యర్థుల లిస్టు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల కు సంబంధించి రెండు జాబితాలను విడుదల చేశారు.మొదటి విడత లో 11, రెండో విడతలో 38 మందు పేర్లను ప్రకటించారు.
కొంతమంది మంత్రులకు ఎంపీలుగా ,ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా మార్పు చేర్పులు చేస్తున్నారు.ఖచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలవడంతో పాటు, అన్ని ఎంపీ స్థానాల్లోనూ వైసీపీ( YCP ) జెండా ఎగురవేయాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.
దానికి అనుగుణంగానే భారీగా మార్పు చేర్పులు చేపట్టారు.
అసెంబ్లీ సీట్లతో పాటు, ఎంపీ అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.కొన్ని కొన్ని నియోజకవర్గాలలో రెండు పేర్లను పరిశీలిస్తున్నారు .వారిలో ఎవరిని ఫైనల్ చేయాలని మరికొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు .ప్రస్తుత ఎంపీ అభ్యర్థుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే … శ్రీకాకుళం ఎంపీ స్థానానికి దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి( Killi Krupa Rani ) , పిరియా విజయలలో ఒకరికి అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం.ఇక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు ఎంపీగా, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట.
అలాగే కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి చలమల శెట్టి సునీల్ లేదా ముద్రగడ పద్మనాభం పేర్లు వినిపిస్తున్నాయి.
అమలాపురం నుంచి ఎలిజా, రాజమండ్రి నుంచి డాక్టర్ అనుసూరి పద్మలత , నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు లేదా రంగనాథరాజులలో ఒకరికి టికెట్ ఇవ్వనున్నారట.ఏలూరు నుంచి అరసవెల్లి అరవింద తో పాటు మరో మాజీమంత్రి పేర్లను పరిశీలిస్తున్నారు.మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలసౌరి స్థానంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ కు ఇవ్వబోతున్నారట.
విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) వైసీపీలో చేరడంతో, ఆ స్థానాన్ని పెండింగ్ పెట్టారు.గుంటూరు, నరసరావుపేట స్థానాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నిర్ణయానికి అనుగుణంగా ఆ సీట్లను ఖరారు చేయనున్నారు .బాపట్ల నుంచి నందిగామ సురేష్, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు లేదా ఆయన కుమారుడు , నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నంద్యాల నుంచి పోతా బ్రహ్మానందరెడ్డి లేదా సినీ నటుడు ఆలీ , కర్నూలు పార్లమెంట్ స్థానానికి గుమ్మనూరు జయరాం పేర్లను ఖరారు చేశారు.అనంతపురం నుంచి శంకర్ నారాయణ , హిందూపురం నుంచి శాంతమ్మ , కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి , తిరుపతి నుంచి డాక్టర్ గురుమూర్తి , రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, చిత్తూరు నుంచి రెడ్డప్ప పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం.
సంక్రాంతికి ముందే అసెంబ్లీ , పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.