లావుగా క‌నిపించే సుమో రెజ్లర్లుకు గుండెపోటులాంటి వ్యాధులు ఎందుకురావంటే..

సుమో రెజ్లర్ శరీరం బరువుగా ఉంటుంది.అయితే వారు కుస్తీ చేస్తున్నప్పుడు అలసిపోరు.

 Why Fat-looking Sumo Wrestlers Get Diseases Like Heart Attack People Health Japa-TeluguStop.com

వారి శరీరం అంత లావుగా ఉన్నప్పటికీ వారికి గుండెపోటు, మధుమేహం లేదా రక్తపోటు లాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌వు.దీనికి కార‌ణం ఇప్పుడు తెలుసుకుందాం.

సుమో రెజ్లర్లు రోజూ 7 వేల కేలరీలు తీసుకుంటారు.వారు సాధారణం కంటే 2 నుండి 3 రెట్లు బరువు కలిగి ఉంటారు.

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, వివిధ రకాల శారీరక శ్రమల కారణంగా సాధారణ వ్యక్తికి మరియు సుమో రెజ్లర్‌కు శరీరంలో తేడా ఉంటుంది.సాధారణ మానవ శరీరంలో బరువు పెరగడం వల్ల ప్యాంక్రియాస్, కాలేయం మరియు ఇతర అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది.

అది అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది.అందుకే సామాన్యులు గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహంతో సతమతమవుతున్నారు.

ఇది సుమో రెజ్లర్ శరీరంలో జరగదు.దీన్ని అర్థం చేసుకోవడానికి అతని శరీరానికి ప‌రిశోధ‌కులు సీటీ స్కాన్ చేశారు.వారి శరీరంలో వ్యాధుల ప్రమాదాన్ని పెంచే విసెరల్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉన్న‌ద‌ని వెల్ల‌డ‌య్యింది.ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై కూడా పరిశోధనలు జరిగాయి.

ఆ పరిశోధనల‌ ప్రకారం.అడిపోనెక్టిన్ హార్మోన్ రక్తంలోకి కొవ్వు చేరకుండా నిరోధిస్తుంది.

రక్తంలో కొవ్వు పెరిగినప్పుడే శరీరంలో విసెరల్ ఫ్యాట్ పెరుగుతుంది, అయితే సుమోల‌ విషయంలో మాత్రం చర్మం కింద కొవ్వు పేరుకుపోతుంది.దీనికి కారణం వ్యాయామమే.

జపాన్‌లో సుమోలు ఉదయం 5 గంటలకు మేల్కొంటారు.వారి శిక్షణ 5 గంటల పాటు కొనసాగుతుంది.ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే డైట్ తీసుకుంటారు.వీరు రిటైరయ్యాక డైట్ మార్చుకోవాల్సివుంటుంది.అప్పుడు వారు శ‌రీరంలో కేలరీల చేరిక‌ను తగ్గించకపోతే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Why Fat-Looking Sumo Wrestlers Get Diseases Like Heart Attack People Health Japan Common Man, Sumo Wrestlers, Fat ,Adiponectin Hormone , Heart Attack ,Diseases, Japan - Telugu Diseases, Heart Attack, Japan, Sumo, Sumo Wrestlers #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube