వీడియో వైరల్: హెల్మెట్ లేకపోవడంతో పట్టుబడిన లేడీ టీచర్.. చివరకు..?

చాలామంది రోడ్లపై వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ రూల్స్( Traffic Rules ) కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ఎదుటివారికి ఇబ్బందులను గురి చేస్తుంటారు.ఈ నేపథ్యంలో అనేక నగరాలలో ట్రాఫిక్ పోలీసులు రోడ్ల ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.

 Video Viral: Lady Teacher Caught For Not Wearing A Helmet.. Finally..?, Viral V-TeluguStop.com

ఎవరైనా ఈ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం వారికి భారీ జరిమాణాలు విధిస్తూ వాహనదారుల్లో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఆయన కానీ కొందరు మూర్ఖులు ఇలా చేస్తున్నకాని వారిలో ఎటువంటి మార్పు రావట్లేదు.

రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సిగ్నల్ జంపింగ్, రాష్ రైడింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ ఇలా అనేక రకాల రూల్స్ ను బ్రేక్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే.

తాజాగా ఓ మహిళా టీచర్( Lady teacher) హెల్మెట్ లేకుండా రోడ్డుపై ప్రయాణం చేసి పోలీసులకు పట్టుబడింది.అయితే తప్పు చేసిన ఆమె పోలీసులపై రివర్స్లో నానా రచ్చ కు దిగింది.దీంతో పోలీసులు షాక్ అయ్యారు.ఆ సమయంలో ఓ పోలీసు అధికారి ఏకంగా ఆమెకు చేతులు జోడించి దండం పెట్టేంతగా ఆమె పోలీసులను ఇబ్బంది పెట్టింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్( Jabalpur ) లో పోలీసులు వాహనాలకు చెక్ చేస్తున్న సమయంలో మహిళా టీచర్ హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డుపై ప్రయాణిస్తుంది.దీంతో సదరు మహిళపై పోలీసు అధికారులు చలానా విధించారు.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.సహనం కోల్పోయిన ఆవిడ రోడ్డుపై గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నాన్న బీభస్థాన్ని సృష్టించింది.ఆ సమయంలో ఆమె చేస్తున్న నిర్వహానికి పోలీసులు బిత్తరపోయి ఆమెను శాంతింప చేయడానికి ప్రయత్నించారు.ఈ ప్రయత్నంలోనే ఓ పోలీసు అధికారి ఆ మహిళకు చేతులెత్తి దండం పెట్టాడు.

ఈ సంఘటన జబల్పూర్ లోని విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి.మహిళ ముందు చేతులు జోడించి దయచేసి నన్ను క్షమించండి.

, మీరు ఇకనుంచి వెళ్లిపోండి అంటూ అతను వేడుకున్నారు.ఇక ఈ మహిళ 200 పైగా చలానాలతో పోలీసులు అధికారులకు ఇదివరకే పట్టుబడింది.

ఇలాంటి వారి వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube