ఒకప్పటి పౌరాణిక నాటకాల నుంచే మనమందరం ఎంజాయ్ చేస్తున్న సినిమా అనే ఆలోచన పుట్టింది అన్న విషయం తెలిసిందే.ఒకప్పుడు నాటకాలతో ప్రతిభ కనబరిచిన వారిని ఆ తర్వాత కాలంలో సినిమాల్లో నటులుగా ఎంతగానో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
తెలుగు సినిమాపై పౌరాణిక నాటకాల ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో సురభి బృందం అందరూ కలిసి భక్త ప్రహ్లాద అనే నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.అదే సమయంలో తెలుగు తెరపై ఒక సినిమా వచ్చింది.
ఎలాగైనా సినిమా చేయాలి అనుకున్న హెచ్.ఎం.రెడ్డి ఏం సినిమా చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారు.అలాంటి సమయంలోనే సురభి నాటక బృందం ప్రదర్శించిన భక్తప్రహ్లాద అనే కథను తీసుకొని అదే బృందంతో 1931లో తొలి టాకీ చిత్రం నిర్మించారు.
హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశ్యపుడు గా వల్లూరు వెంకట సుబ్బారావు నటించారు.అయితే అటు సురభి నాటక రంగంలో స్టార్ గా వెలుగొందుతున్న సుబ్బారావు ని శరణ్య కశ్యపుని గా నటింపజేసేందుకు ఇక దర్శకుడు హెచ్.
ఎం.రెడ్డి బాగానే కష్టపడ్డాడట.

భక్త ప్రహ్లాద చిత్రంలో లీలావతి పాత్రను అటు సురభి నాటక బృందం లో ఎంతో అనుభవజ్ఞులైన కమలాబాయి అప్పగించగా ఆమె ఎంతో అద్భుతంగా పాత్రను పోషించారు.తొలి తెలుగు తెర కథానాయిక ఆమెనే కావడం గమనార్హం.ఇక టైటిల్ పాత్రను రాములమ్మ రంగారావు సంతానమైన మాస్టర్ కృష్ణారావు పోషించారు.ఇక ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలైంది.అయితే అప్పట్లో నటీనటులందరూ 20 గంటలు పని చేస్తుండేవారు.అయితే హీరోయిన్ కమల బాయి సినిమా కోసం ముందుగా 500 రూపాయలు పారితోషికం మాట్లాడుకుందట.
కానీ అవి ఖర్చులకు సరిపోయాయి.దీంతో ఈ విషయం తెలుసుకున్న నిర్మాత ఆమెకు వెయ్యి నూటపదహార్లు రైలు ఖర్చులు కూడా ఇచ్చారట.
ఇది అప్పట్లో ఎంతో హాట్ టాపిక్ గా మారింది.