నెలసరి సమయంలో దాదాపు చాలా మంది ఆడవారు నలతగా, నీరసంగా, మూడ్ ఆఫ్‌లో కనిపిస్తుంటారు.ఆ నాలుగు రోజులు సరిగ్గా తిండి కూడా తినరు.
నిద్ర కూడా పట్టదు.మరోవైపు తీవ్రమైన నొప్పులు నానా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.
అయితే వీటన్నిటికి చెక్ పెట్టి నెలసరి సమయంలో ఫుల్ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఖచ్చితంగా డైట్‌లో కొన్ని ఫుడ్స్‌ను చేర్చుకోవాల్సి ఉంటుంది.మరి అవేంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
నెలసరి సమయంలో ఉదయం లేవగానే టీ, కాఫీలు కాకుండా.ఒక గ్లాస్ నీటితో దంచిన అల్లం ముక్క, చిటికెడు మిరియాల పొడి, కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి వడబోసుకుని ఆ తర్వాత అందులో ఒక స్పూన్ తేనె కలిపి సేవించాలి.ఆ నాలుగు రోజు ఇలా చేస్తే నడుము నొప్పి, కాళ్లు, చేతులు లాగడం, కడుపు నొప్పి వంటి సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్, ఇడ్లీ, దోశ, ఉప్మ వంటివే కాకుండా రాత్రంతా నీటిలో నాన బెట్టిన ఐదు ఎండు ద్రాక్ష, ఐదు బాదం పప్పులు ఉండేలా చూసుకోవాలి.
ఇవి నీరసాన్ని నివారించి మూడ్ ఆఫ్ నుంచి బయట పడేస్తాయి.
మధ్యాహ్నం భోజనంలో బ్రౌన్ రైస్, రోటి, కాయకూరల పులుసు, ఆకుకూరలతో చేసిన పప్పుతో పాటుగా ఒక కప్పు పెరుగు తప్పని సరిగా ఉండేలా తీసుకోవాలి.
రాత్రి భోజరంలో హెవీగా కాకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.రాగి దోసెలు, సగ్గుబియ్యం కిచిడీ, సలాడ్స్ వంటివి తింటే మంచిది.
నెలసరి సమయంలో నెయ్యిని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా తీసుకోవాలి.తద్వారా అందులో ఉండే పోషక విలువలు శరీరానికి బోలెడంత శక్తిని అందించి యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మారుస్తాయి.
మరియు నొప్పులను నివారిస్తాయి.
నెలసరి సమయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది.అందుకే ఆ నాలుగు రోజులు ఖచ్చితంగా జీడిపప్పు, తాజా పండ్లు, పండ్ల రసాలు, డార్క్ చాక్లెట్, అవిసె గింజలు, గ్రీన్ టీ వంటివి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.అదే సమయంలో ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, స్వీట్స్, మసాలా ఎక్కువగా ఆహారాలకు దూరంగా ఉండాలి.