టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రేవతి( Revathi ) కుటుంబానికి పూర్తిస్థాయిలో సపోర్ట్ దక్కుతోంది.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను వేణుస్వామి పరామర్శించడంతో పాటు 2 లక్షల రూపాయల సహాయం అందించడం గమనార్హం.
శ్రీతేజ్ పేరుపై సొంత డబ్బుతో మృత్యుంజయ హోమం జరిపిస్తానని వేణుస్వామి ( Venuswami )చెప్పుకొచ్చారు.శ్రీతేజ్ ను నేను చూసి వచ్చానని బాబు త్వరలో కోలుకుంటాడని వేణుస్వామి అన్నారు.
నా సొంత డబ్బులతో మృత్యుంజయ హోమాన్ని( Mrityunjaya Homam ) శ్రీతేజ్ పేరున చేస్తానని వేణుస్వామి తెలిపారు.నా శక్తి మేర రేవతి కుటుంబానికి 2 లక్షల రూపాయల సాయం అందజేస్తానని వేణుస్వామి వెల్లడించారు.
కొంచెం ఆలస్యమైనా శ్రీతేజ్( Shritej ) సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాడని వేణుస్వామి పేర్కొన్నారు.ఇది అనుకోని సంఘటన అని ఆయన కామెంట్లు చేశారు.
వచ్చే ఏడాది మార్చి నెల 28వ తేదీ వరకు అల్లు అర్జున్ జాతకం బాలేదని వేణుస్వామి వెల్లడించారు.అయితే ఆ తర్వాత అంత మంచే జరుగుతుందని వేణుస్వామి పేర్కొన్నారు.వేణుస్వామి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఈ ఒక్క విషయంలో మాత్రం వేణుస్వామిని మెచ్చుకోవాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్పకుండా ఉంటే మంచిదని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరి వేణుస్వామి సెలబ్రిటీల జాతకాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.నాగచైతన్య శోభిత జాతకాలను చెప్పడం వల్ల వేణుస్వామి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
చైతన్య శోభిత మాత్రం ఈ కామెంట్ల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.స్టార్ హీరో నాగచైతన్య కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.