సోషల్ మీడియాలో మనకు తరచుగా కనిపించే ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ఇదే ఆ ఫోటో.
మాజీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పీవీ.నర్సింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఇందులో ఉన్నారు.
ఈ ముగ్గురు భోజనం చేస్తున్న ఫోటో ఇది.అసలు ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎందుకు తీశారు? ఈ ముగ్గురు మహామహులు కసిన సందర్భం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఫోటోను 1972లో తీశారు.అప్పుడు పీవీ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆ సమయంలోనే జై ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.దానికి ముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సైతం అంతకు మించి నడిచింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొన్ని హామీలను ఇచ్చింది.వీటిని నిరసిస్తూ జై ఆంధ్ర ఉద్యమం లేచింది.
అదే సమయంలో ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా రాష్ట్రం కలిసి ఉండేలా చేసేందుకు ప్రయత్నించాడు.తెలుగుజాతి మనది…నిండుగ వెలుగుజాతి మనది… అంటూ తన సినిమాల్లో పాటలు పెట్టాడు.

ఏపీలో జై ఆంధ్ర ఉద్యమం ఊపుమీద ఉన్న సమయంలోనే పీవీ నర్సింహారావు మద్రాసుకు వెళ్లాడు.ఆ సమయంలో అక్కడే ఉన్న సినీ నటుడు ఎన్టీఆర్ తనను భోజనానికి పిలిచాడు.అప్పుడు తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్జీఆర్ ను సైతం లంచ్ కు పిలిచాడు ఎన్టీఆర్.ఈ ముగ్గురు పెద్దలు ఎన్టీఆర్ ఇంట్లో కలుసుకున్నారు.ఈ ముగ్గురు సంప్రదాయానికి విలువ ఇచ్చేది.అందుకే నేల మీదే కూర్చుని భోజనం చేశారు.

అటు ఈ ముగ్గురి మధ్య ఓ పోలిక ఉంది.పీవీ 1971లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే.ఆ తర్వాత 5 ఏండ్ల తర్వాత 1977 జూన్ 30న తమిళనాడు సీఎంగా ఎమ్జీఆర్ స ప్రమాణం చేశారు.
ఎమ్జీఆర్ సీఎం అయిన 5 ఏండ్ల తర్వాత అంటే 1983 జనవరి 9న ఏపీ సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణం చేశారు.పీవీ పీఎం అయినప్పుడు ఎన్టీఆర్ చాలా సంతోషించారు.
నంద్యాల ఎంపీ స్థానం నుంచి పీవీ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు.తమకు బద్ద విరోధి పార్టీ అయినా ఎన్టీఆర్ తనపై తెలుగుదేశం అభ్యర్థిని నిలపకపోవడం విశేషం.
అటు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ స్థాపించినప్పుడు ఎమ్జీఆర్ అందులో కీలక పాత్ర పోషించారు.