టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో శృతి హాసన్( Shruti Haasan ) ఒకరు.ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్న శృతి హాసన్ తన లైఫ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
లైఫ్ లో ఇలాంటి పని ఎందుకు చేశానా అని బాధ పడిన సందర్భాలు పెద్దగా ఏమీ లేవని శృతి తెలిపారు.కానీ నాకెంతో ఇష్టమైన వారిని చాలాసార్లు బాధ పెట్టానని శృతి పేర్కొన్నారు.
అనుకోకుండా అది జరిగినా అలా చేయకుండా ఉండాల్సిందనే భావన నాలో ఉందని శృతి చెప్పుకొచ్చారు.లైఫ్ లాంగ్ వారికి క్షమాపణలు చెబ్తూనే ఉంటానని ఆమె పేర్కొన్నారు.లైఫ్ లో ప్రతి ఒక్కరికీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ( Failure Love Story ) ఉంటుందని శృతి హాసన్ అన్నారు.మాజీ భాగస్వామి వల్ల మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటామని శృతి హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాకు కూడా అలాంటి బ్రేకప్ స్టోరీలు ఉన్నాయని ఆమె తెలిపారు.బ్రేకప్ అయ్యాక దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటానని శృతి అన్నారు.నా లవ్ స్టోరీలను ఉద్దేశించి చాలామంది మాట్లాడుతుంటారని శృతి హాసన్ వెల్లడించారు.ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంటారని ఆమె అన్నారు.వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే వారి దృష్టిలో అది కేవలం నంబర్ మాత్రమేనని ఆమె తెలిపారు.

కానీ నాకు అలా కాదని నేను కోరుకున్న ప్రేమను పొందడంలో అన్నిసార్లు ఫెయిల్ అవుతున్నానని అర్థం అని శృతి హాసన్ వెల్లడించారు.అది నన్ను బాధ పెడుతుందని ఎందుకంటే నేనూ మనిషినే కదా అని శృతి హాసన్ అన్నారు.బ్రేకప్ అయినంత మాత్రాన మనిషిని తప్పు పట్టకూడదని మనిషి మారడం సహజమని రిలేషన్ షిప్ లో తాను నిజాయితీగా ఉన్నానని శృతి హాసన్ అన్నారు.