సినిమా స్టార్స్ అంటే అభిమానులకు అపారమైన ప్రేమ.ఎంతో మంది అభిమానులు తమ ఫేవరెట్ హీరోలను చూడటానికైనా, ఒక్క సెల్ఫీ తీసుకోవడానికైనా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఇటీవల అలాంటి ఉదంతాల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరలవుతున్నాయి.ఒక్కసారి అభిమానుల ఉత్సాహం పెరిగితే వారు తమ ఆలోచన లేకుండా సాహసాలు చేస్తారు.
ఈ కోవకు చెందిన ఓ తాజా ఘటన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (దళపతి విజయ్)( Dalapathy Vijay ) కార్యక్రమంలో చోటుచేసుకుంది.
విజయ్ ఇటీవల కోయంబత్తూరులో తన కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’( Tamilaga Vetri Kazhagam ) తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ్ తన వ్యాన్ పై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ చేయి ఊపుతూ కనిపించారు.ఈ సమయంలో ఓ అభిమాని అతడిని దగ్గరగా చూడాలనే ఆశతో, చెట్టుపైకి ఎక్కి, అక్కడి నుంచి విజయ్ ఉన్న వ్యాన్ మీదకు దూకేశాడు.
ఈ దృశ్యాన్ని చూసిన విజయ్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ అభిమాని ప్రవర్తనను చాలా శాంతంగా తీసుకున్న విజయ్, అతడిపై పార్టీ కండువా కప్పి సాదరంగా పంపించారు.ఈ సంఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరు “అభిమానం కాస్త ఎక్కువైనట్లుంది” అని కొందరు కామెంట్ చేస్తుండగా, “ఇలా ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం తెలివిలేనితనం” అంటూ విమర్శిస్తున్నారు.
మరికొందరెమో “ఇది ముందుగానే ప్లాన్ చేసినట్లు ఉంది” అని అభిప్రాయపడుతున్నారు.
ఇక విజయ్ ప్రస్తుత సినిమా విషయానికి వస్తే, ఆయన ‘జన నాయగన్’( Jana Nayagan Movie ) అనే చిత్రంలో నటిస్తున్నారు.హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇదే విజయ్ చివరి సినిమా కావచ్చని సమాచారం.సినిమా తరువాత విజయ్ పూర్తిగా తన రాజకీయ ప్రయాణంపై దృష్టి సారించనున్నారని టాక్.