రామానాయుడు( Ramanaidu ) .తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మకుటం లేని మంచి నిర్మాత.
అయన చేసిన సినిమాలు, స్టూడియో ని నిలబెట్టిన తీరు ఎందరికో ఆదర్శం.సినిమా ఇండస్ట్రీ లో తన వారసులను పంపించే ముందు అన్ని బాగా ఆలోచించాడు.
పెద్ద కొడుకు సురేష్ బాబు( Suresh Babu ) సినిమాలకు పనికి రాడు అని ముందే ఊహించి అతడిని స్టూడియోలు, నిర్మాణం, ఆర్థికం వంటి విషయాల్లో బాగా ట్రైన్ చేసి వదిలాడు.అయన మనిషిగా, నిర్మాతగా సూపర్ సక్సెస్.
విలువలతో సినిమాలు తీసాడు.తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
అలాగే చిన్న కొడుకు లుక్స్ పరంగా గుడ్ అందుకే వెంకటేష్ ని నటనకు మాత్రమే పరిమితం చేసాడు.ఈ ఇద్దరు కొడుకులు కూడా ఏ రోజు తండ్రి గీచిన గీతను దాటలేదు.
అందుకే వారిద్దరూ సక్సెస్ అయ్యారు.

ఇక సురేష్ బాబు కూడా తండ్రిలాగానే ఆలోచించ్చాడు.పెద్ద కొడుకు లుక్స్ పరంగా యావరేజ్ అయినా కూడా నటన పరంగా ఒకే .అందుకే హీరో అవ్వాలని రుద్దే ప్రయత్నం చేయకుండా నటిస్తే చాలు అని ముందు నుంచి అతడిని ఆలా ప్రిపేర్ చేసారు.అలాగే రానా కూడా తండ్రి చెప్పిన మాట ప్రకారం ఒకే అంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.మధ్య మధ్య లో చిన్న తప్పటడుగులు పడిన కూడా రానా( Rana ) సక్సెస్ అయ్యాడు.
కానీ చిన్న కొడుకు అభిరాం విషయం లో మొదటి నుంచి సురేష్ బాబు( Suresh Babu ) తనలాగా స్టూడియోస్, నిర్మాణం చేసుకొమ్మని చెప్పిన వినలేదు.హీరో అయిపోవాలని కలలు కన్నాడు.
సత్యానంద్ దగ్గర నటనలో ట్రైన్ అయ్యాడు.కొన్నాళ్ల పాటు ఇంట్లోకి కూడా రానివ్వలేదట సురేష్ బాబు.
అయినా తీరు మార్చుకోలేదు.సరే నీకు ఒక్క అవకాశం మాత్రమే అని చెప్పారట.

అందుకే అభిరాం ఒక ఇంటర్వ్యూ ఈ సినిమాతో నా కెరీర్ ఏంటో డిసైడ్ అయిపోతుంది.హీరో గా అదృష్టం కలిసి వస్తే ఒకే లేదంటే స్టూడియో చేసుకోవాల్సిందే అని చెప్పాడు.పైగా సినిమా షూటింగ్ లో కూడా రష్ చుసిన సురేష్ తేజ చేస్తన్న నిర్వాకం, కొడుకు నటన పట్ల వ్యతిరేఖంగా ఉండేవాడట.సినిమా ఆపెయ్యమని చెప్పిన కూడా నో నో అంటూ కొనసాగించి ఇప్పుడు బొక్క బోర్లా పడ్డారు.
ఇక అభిరాం కి స్టూడియో వ్యవహారాలే గతి.