ఏపీలో రేపటి నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.మొత్తం పది జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
రేపు ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఈనెల 10 వ తేదీ వరకు నిర్వహించనున్నారు.కాగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయి.ఈక్రమంలో అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.45 నిమిషాలు వరకు మాత్రమే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఇస్తారు.అయితే గతం తరహాలో ట్యాబ్ లలో కాకుండా ఈసారి ప్రశ్నాపత్రాలను నేరుగా చేతికి అందించనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెల్లడించిన విషయం తెలిసిందే.







