ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.06
సూర్యాస్తమయం: సాయంత్రం 06.02
రాహుకాలం: సా.04.32 నుంచి 06.02 వరకు
అమృత ఘడియలు: మ.03.46 నుంచి 05.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.4.26 నుంచి 05.14 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీ ఆర్థిక అభివృద్ధి చేసుకొనడానికి కొత్తగా ఆలోచనలు చేయాలి.ఏకాగ్రతతో మీ పని చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు అందుతాయి.మీరు చేసే పనుల్లో నైపుణ్యత ఉండాలి.
మీ పనిలో ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల మీరు మీ పని తొందరగా చేసుకుంటారు.దీనివల్ల మీకు ఆనందం కలుగుతుంది.
వృషభం:

ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు.దీని వల్ల మీకు ఆర్థిక సమస్య ఏర్పడుతుంది.మీరు ఇతరులకు సహాయం చేయడానికి మాట ఇస్తారు.మీకు ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలలో పాల్గొనాలి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ వైవాహిక జీవితంలో మీ పాత మధుర జ్ఞాపకాలను తలచుకుంటూ సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా బలంగా ఉంటారు.దీనివల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలలో పాల్గొంటారు.దీంతో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు బాధ పడతారు.మీ వైవాహిక జీవితం ఆనందంతో సాఫీగా సాగుతుంది.
కర్కాటకం:

ఈరోజు ఆర్థికంగా మీరు పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల మీరు భవిష్యత్తులో దృఢంగా ఉంటారు.మీ సమయాన్ని కాస్త మీ గురించి కూడా కేటాయించాలి.
మీరు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి .మీ జీవితం పై దృష్టి పెట్టండి.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహం:

ఈరోజు మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి ఉండదు.మీరు ఏదైనా విషయంలో మీ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
మీ ఆరోగ్యం అనుకూలంగానే ఉంది.ఈరోజు మీరు ఒంటరితనం నుంచి బయట పడతారు.కొన్ని విషయాల్లో మీ భాగస్వామి మిమ్మల్ని మెచ్చుకుంటుంది.
కన్య:

ఈరోజు మీ విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు.దీని వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉండదు.కాబట్టి మీరు మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరు ఈ రోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.దీనివల్ల మీరు కాస్త ఆనందంగా ఉంటారు.మీ వైవాహిక జీవితం అద్భుతమైన రోజు గా ఉంటుంది.
తులా:

ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని చోట్ల లాభాలు అందుతాయి.మీ ఇంటి విషయంలో ఏదైనా పనిలో పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.అందరిలోను ఉన్న ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు.
కుటుంబం గురించి ఖర్చులు చేస్తారు.మీ వైవాహిక జీవితంలో అద్భుతమైన అనుభూతిని పొందుతారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు పెడతారు.దీని వల్ల మీ మానసిక ప్రశాంతతను కోల్పోతారు.మీ ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.త్వరలోనే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి .మీ వైవాహిక జీవితం మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకుంటారు.
ధనస్సు:

ఈరోజు మీరు ఇచ్చిన అప్పును తిరిగి పొందుతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యుల నుండి డబ్బులు అందుతాయి.
తీరికా లేని పనితో ఉన్నవారు ఈ రోజు ప్రశాంతతను అందుకుంటారు.దీనివల్ల మీరు ఆనందంగా ఉంటారు.మీ జీవిత భాగస్వామి మధ్య మీకు గొడవలు ఉన్న మళ్లీ సర్దుకుపోతారు.
మకరం:

ఈరోజు మీరు శుభవార్త వింటారు.మీకు ఏదైనా పని కష్టంగా అనిపిస్తే దాన్ని వాయిదా వేయండి.దానివల్ల మనశ్శాంతి కలుగుతుంది.
మీరు అనవసరంగా ఖర్చులు పెడతారు.దీనివల్ల ఆర్థిక సమస్య ఏర్పడుతుంది.
మీ కుటుంబ సభ్యులు మీ లక్షణాల గురించి పొగుడుతారు.తీరిక లేని పనుల నుండి ప్రశాంతతను పొందుతారు.
కుంభం:

ఈరోజు ఇతరులపై ఆధారపడకుండా ఆర్థిక లాభాన్ని పొందుతారు.మీ ఇంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.దీనివల్ల మీరు ఆనందంగా ఉంటారు.మీకు ఇష్టమైన వారిని దూరమవుతున్నారు.మీ వైవాహిక జీవితం మధ్య ఆనందం అనేది దొరకక ఆనందం కోసం కొత్తగా ప్లాన్ చేయండి.
మీనం:

ఈరోజు ఎక్కువగా ఖర్చు పెడతారు.దీనివల్ల ఆర్థిక సమస్య ఎదురవుతుంది.మీ కుటుంబ సభ్యులతో మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడండి.
మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.దూరంగా వెళ్లి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.
మీకు ఇష్టమైన వ్యక్తి నుండి మీకు మంచి బహుమతి అందుతుంది.ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.