నాగ దోషంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ దేవాలయానికి..?

హిందువు ధర్మంలో నాగ దోషాన్ని( Naga Dosha ) చాలామంది ప్రజలు విశ్వసిస్తారు.ఒక వ్యక్తి జాతకం ప్రకారం నాగ దోషం ఉన్నట్లయితే కచ్చితంగా పరిహారం చేసుకోవాలి.

 Are You Facing Many Problems With Naga Dosha.. But For This Temple , Naga Dosha-TeluguStop.com

ఈ దేవాలయానికి వెళ్ళినట్లయితే వీటి పరిహారాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.ఒక వ్యక్తికి నాగదోషం ఉంటే అది చాలా అరిష్టం, ఆర్థిక నష్టానికి, సంతానం నష్టానికి దారితీస్తుందని చెబుతున్నారు.

ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా పరిహారం చెల్లించుకోవాలి.అలాగే చాలా సంవత్సరాల వరకు పెళ్లి కాకపోయినా, పెళ్లి అయినప్పటికీ పిల్లలు పుట్టకపోయినా అది నాగ దోషంగానే భావించాలని పండితులు ( Scholars )చెబుతున్నారు.

Telugu Financial, Horoscope, Krishna, Mopidevi Temple, Naga Dosha, Progeny, Scho

నాగ దోషం అనేది పూర్వజనంలో పాములను చంపిన వారికి, ఔషధాలతో సర్పాలని బంధించే వారికి,పుట్టలను తవ్వేవారికి, పుట్టలను తొలగించి ఇల్లు కట్టే వారికి నాగదోషం తగులుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.జాతక చక్రంలో రాహువు లేదా కేతువు 1, 2, 5, 7, 8 స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేక అశుభ స్థానాలలో ఉన్నట్లయితే సర్ప దోషం ఉందని చెప్పవచ్చు.ఇలాంటి వాళ్లు సమయానికి సంతానం లేక ఇబ్బందులు పడుతుంటారు.అలాగే సమయానికి వివాహాలు కూడా జరగవు.ఇలాంటి వాళ్లు కచ్చితంగా పరిహారం చేయించుకోవాలి.నాగ దోషంతో ఇబ్బంది పడేవారు కృష్ణా జిల్లాలోని మోపిదేవి దేవాలయాని( Mopidevi temple )కి వెళ్లాలి.


Telugu Financial, Horoscope, Krishna, Mopidevi Temple, Naga Dosha, Progeny, Scho

ఈ దేవాలయం మచిలీపట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.దీనిని మోహిని పురం అని కూడా పిలుస్తారు.మోపిదేవి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.అక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ( Subrahmanyeshwar Swamy )సర్ప రూపంలో వెలిశారని చాలామంది ప్రజలు నమ్ముతారు.నాగ పంచమి రోజు ఈ విశిష్టమైన పుణ్యక్షేత్రానికి మన దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.నాగ దోషం తో బాధపడేవారు, వివాహం జరగక బాధపడేవారు, సంతానం కోసం ప్రయత్నించేవారు, మోపిదేవి దేవాలయంలో ప్రతిజ్ఞ పూజలు చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారని నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube