ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్.ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా కనిపించనున్నాడు.
సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటిస్తుంది.సినిమా రిలీజ్ ట్రైలర్ తో అంచనాలు మరింత పెంచిన రాధేశ్యామ్ సినిమా లో ఇప్పటివరకు విలన్ ఎవరన్నది రివీల్ చేయలేదు.
ప్రేమ.డెస్టినీ ఈ రెండిటి మధ్య సినిమా కథ నడుస్తుంది.సినిమాలో ప్రత్యేకమైన విలన్ లు ఎవరు ఉండరని అంటున్నారు.డెస్టినీతో హీరో, హీరోయిన్ ల మధ్య దూరం వస్తుందట.
సినిమాలో చెప్పుకోవడానికి విలన్ అంటూ ఎవరూ ఉండరని.ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు చిత్రయూనిట్.
రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే నటించారు.
జస్టిన్ ప్రభాకరణ్ మ్యూజిక్ ఇప్పటికే సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పరచింది. మార్చి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 10 వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని టాక్.