`కొత్త కొత్తగా' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `కొత్త కొత్తగా‘.ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్రధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి జి గోవిందరాజు సమర్పిస్తున్నాను.

 'kotta Kottaga' Theatrical Trailer Released , Kotta Kottaga,ajay, Veerthi Vaghan-TeluguStop.com

ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు.రెండు నిమిషాల 30 సెకన్లు నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.యూత్ ఫుల్ ఎలిమెంట్స్, డిఫరెంట్ లవ్ స్టొరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ టైటిల్ కి తగ్గట్టే కొత్త కొత్తగా వుంది.సరదా ఫ్యామిలీ, కాలేజ్ ఎంటర్ టైమెంట్ తో మొదలై చివర్లో సీరియస్ డ్రామాగా మలుపు తీసుకోవడం కథపై మరింత ఆసక్తిని పెంచింది.

అజయ్‌, వీర్తి వఘాని తమ నటనతో ఆకట్టుకున్నారు.కాశీ విశ్వనాధ్, తులసి, కల్యాణి నటరాజన్ పాత్రలు కీలకంగా వున్నాయి.

సాంకేతికంగా ట్రైలర్ వున్నంతంగా వుంది.ట్రైలర్ కు శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది.సిద్ శ్రీరామ్ పాడిన ఆకాశం నా కోసం పాట నేపధ్యంలో అద్భుతంగా వుంది.వెంకట్ కెమెరా, పనితనం డీసెంట్ గా వుంది.

మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలని పెంచింది.ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube