కాఫీ డార్క్ సర్కిల్స్ ను పొగొడుతుందా?

డార్క్ సర్కిల్స్( Dark circles ).మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో ఒకటి.

 Does Coffee Remove Dark Circles? Dark Circles, Latest News, Coffee, Coffee Benef-TeluguStop.com

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటం వల్ల ముఖంలో మెరుపు మొత్తం మాయం అవుతుంది.ఏమాత్రం ఎట్రాక్టివ్ గా కనిపించలేరు.

ముఖాన్ని అద్దంలో చూసుకున్న ప్రతిసారి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు.

అయితే అలాంటి వారికి కాఫీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.కాఫీ పౌడర్( Coffee powder ) ను ఉపయోగించి సులభంగా డార్క్ సర్కిల్స్ ను పోగొట్టుకోవచ్చు.

Telugu Coffee, Coffee Benefits, Dark Circles, Coffeeremove, Latest, Skin Care, S

రెమెడీ 1: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పొటాటో జ్యూస్( Fresh potato juice ), వన్ టీ స్పూన్ తేనె( honey ) మరియు పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఐ మాస్క్ ను తొలగించాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతాయి.

Telugu Coffee, Coffee Benefits, Dark Circles, Coffeeremove, Latest, Skin Care, S

రెమెడీ 2: కాఫీ పౌడర్ ఉపయోగించి మరొక విధంగా కూడా డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసి సున్నితంగా సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ విధంగా చేసినా కూడా డార్క్ సర్కిల్స్ చాలా వేగంగా దూరమవుతాయి.కళ్ళ చుట్టూ చర్మం వైట్ గా బ్రైట్ గా మారుతుంది.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల కళ్ల వద్ద ముడతలు ఏమైనా ఉన్నా కూడా తగ్గు ముఖం పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube