ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే..న‌ల్ల మ‌చ్చ‌ల‌న్నీ ప‌రార్‌!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖంపై మొటిమ‌లు లేదా ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల న‌ల్ల మ‌చ్చ‌లు ప‌డుతుంటాయి.చూసేందుకు అందవిహీనంగా క‌నిపించే ఆ న‌ల్ల మ‌చ్చ‌లు.

 If You Wash Your Face With This Water, All The Black Spots Will Disappear! Black-TeluguStop.com

ముఖ సౌంద‌ర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.అందుకే వాటిని నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు, సీర‌మ్‌లు యూజ్ చేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా ఆ మ‌చ్చ‌ల‌ను పోగొట్టుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే వాట‌ర్‌తో ప్ర‌తి రోజు ఫేస్‌ను వాష్ చేసుకుంటే.

కొద్ది రోజుల్లోనే ముఖంపై ఏర్ప‌డిన న‌ల్ల మ‌చ్చల‌న్నీ ప‌రార్ అవుతాయి.

మ‌రి ఇంకెందుకు లేట్‌.

ఆ వాట‌ర్ ఏంటో.? ఎలా త‌యారు చేసుకోవాలి.? తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో మూడు గ్లాసుల వాట‌ర్ పోసి హీట్ చేసుకోవాలి.

వాట‌ర్ వేడి అయిన త‌ర్వాత‌.గుప్పెడు వేపాకుల‌ను, గుప్పెడు తుల‌సి ఆకుల‌ను లైట్‌గా దంచి వేయాలి.

వాట‌ర్ క‌ల‌ర్ మారే వ‌ర‌కు బాగా మ‌రిగిచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు గోరు వెచ్చ‌గా అయ్యాక వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని అందులో రెండు స్పూన్ల రోజ్ వాట‌ర్‌, ఒక స్పూన్ గ్లిజ‌రిన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఇక ఈ వాట‌ర్‌ను యూజ్ చేసి ఉద‌యాన్నే ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక‌.వేప మ‌రియు తుల‌సి ఆకుల్లో ఉండే ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు చ‌ర్మంపై ఏర్ప‌డిన మొటిమ‌ల‌ను క్ర‌మంగా మాయం చేస్తాయి.అలాగే ఈ వాట‌ర్‌తో రెగ్యుల‌ర్‌గా ముఖాన్ని శ‌భ్ర ప‌రుచుకుంటే.

చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్ని గీత‌లు ప‌డ‌కుండా ఉంటాయి.

మొటిమ‌లు స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ముఖ చ‌ర్మం నిగారింపుగా మెరిసి పోతుంది.మ‌రియు కళ్ల మంటలు, దురదలు, అలసట, ఎర్ర బారడం వంటి స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

కాబ‌ట్టి, న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్న వారే కాదు.ఎవ్వ‌రైనా ఈ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవ‌చ్చు.

Home Remedies to Get Rid of Black Spots on Face

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube