తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా తెలుగు ప్రముఖ దర్శకుడు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందిస్తున్నాడు.
దీంతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రముఖ సినీ నిర్మాత రాధాకృష్ణ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.ఇక ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే తెలుగు ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నిత్య మీనన్ మలయాళ ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
దీంతో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే వచ్చే ఏడాది జనవరి 12వ తారీఖు న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా చేశారు.
కానీ సంక్రాంతి బరిలో అప్పటికే ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మరియు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తూ నటించిన రాధేశ్యామ్ చిత్రాలు పోటీపడుతున్నాయి.

అంతేకాకుండా సినిమా థియేటర్లు కూడా దాదాపుగా ఇప్పుడు అయ్యాయి.దీంతో మూడు భారీ బడ్జెట్ చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో విడుదల కానుండడంతో సినిమా థియేటర్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు తలనొప్పిగా మారింది.దీంతో ఈ విషయం గురించి ఇచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ సభ్యులతో చర్చించిన అనంతరం భీమ్లా నాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25వ తారీకు విడుదల చేసేందుకు ఈ చిత్ర యూనిట్ సభ్యులు అంగీకరించారు.
దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అలాగే తాజాగా ఆర్.ఆర్.ఆర్ చిత్ర నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరియు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ సభ్యులకు స్పెషల్ గా కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా పెద్ద బడ్జెట్ చిత్రం అయినా చిన్న బడ్జెట్ చిత్రం అయినా ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో నిర్మాతలు లు మరియు చిత్ర యూనిట్ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటేనే అందరికీ మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.అలాగే గత ఏడాది కూడా సినిమాల విడుదల సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని దీంతో సంక్రాంతి బరిలో దిగిన సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురం లో హీరోలుగా నటించిన ప్రిన్స్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ లతో కూడా సంప్రదించగా వీరిద్దరూ చాలా సానుకూలంగా స్పందించారని గుర్తు చేసుకున్నారు.
అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రముఖ సినీ నిర్మాత డి.వి.వి.దానయ్య కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి స్పెషల్ థాంక్స్ తెలియజేశాడు.