మీరు ముఖానికి వాడే పౌడర్ క్యాన్సర్ ని తీసుకొస్తే ?

అద్దం ముందు నిల్చున్నాం అంటే చాలు పౌడర్ మీదకే చేతులు వెళతాయి.గడప దాటి బయటకి వెళ్ళాలి అంటే పౌడర్ ఉండాల్సిందే.

 Talcum Powder Can Develop Few Types Of Cancers In Your Body-TeluguStop.com

పౌడర్ ముఖానికి అద్దనిదే కాలు కదలదు.చర్మం జిడ్డుగా అనిపించడం వలన, చెమటగా అనిపించడం వలన పౌడర్ వాడుతారు జనాలు.

కాని ఆ జిడ్డుని ఎలా తొలగించాలో ఆలోచించకుండా ప్రమాదకరమైన పౌడర్ మీద ఆధారపడతారు.ఇక్కడ పౌడర్ ని ప్రమాదకరం ఎందుకు అన్నాం అంటే పరిశోధనల ఫలితాలు అలా ఉన్నాయి.

ఇది కొత్త స్టేట్మెంట్ కాదు, కాని పరిశోధకులు మళ్ళీ గుర్తు చేసారు .మనం వాడే టాల్కం పౌడర్ వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.ఒక పాపులర్ టాల్కం పౌడర్ కంపెని (జాన్సన్ అండ్ జాన్సన్) మీద ఇటివలే ఒక లాసూట్ కూడా దాఖలైంది ఈ విషయం మీద

ఈ టాల్క్ అంటే ఏమిటి ? దీమ్మి మేగ్నేశియం, సిలికోన్ మరియు ఆక్సిజన్ కలిపి తయారు చేస్తారు.ఈ టాల్క్ ఇటు టాల్కం పౌడర్ తో పాటు చిన్నపిల్లల కోసం మనం వాడే బేబి పౌడర్ లో, మనం అందం కోసం వాడే రకరకాల పౌడర్స్ లో ఉంటుంది.

ఈ టాల్క్ లో క్యాన్సర్ ని తీసుకొచ్చే అస్ బెటాస్ (కార్సినోజేన్) లక్షణాలు ఉంటాయి.ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, అమెరికన్ సొసైటి ఆఫ్ క్యాన్సర్ లో ఎలుకలపై పరిశోధన చేసి మరి తేల్చారు.బ్లీడింగ్, డిశ్చార్జ్, పుండ్ల వలన కొందరు మహిళలు పౌడర్స్ ని యోని పరిసరాల్లో కూడా వాడతారు.దీనివలన ఓవరియన్ క్యాన్సర్ రావచ్చు.

డైరెక్ట్ గా వాడకపోయినా, ప్యాడ్స్, నాప్కిన్స్, కాండమ్స్ లో పౌడర్స్ వాడినా క్యాన్సర్ ని తీసుకొచ్చే పదార్థాలు యోని, ఉటేరాస్.ఒవరీస్ లో కి వెళ్ళిపోతాయి.

అప్పుడే ఓవరియన్ క్యాన్సర్ మొదలవుతుంది.అందుకే మహిళలు డాక్టర్ ని ఖచ్చితంగా సంప్రదించే ఏం వాడాలో, ఏం వాడకూడదో తెలుసుకోవాలి

ఈ టాల్క్ పౌడర్ గాలిలో కలిసి, ఆ గాలిని మనం పీల్చుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు.

ఇక ఇలాంటి పౌడర్స్ ని ముఖానికి, ఒంటికి రుద్దుకోవడం వలన స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.కాబట్టి ఒక పౌడర్ వాడే ముందు దాని గురించి పూర్తీ వివరాలు తెలుసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube