న్యాచురల్ స్టార్ నానికి( Natural Star Nani ) ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.నాని నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన హిట్3 సినిమా( Hit 3 Movie ) ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.వయోలెన్స్ తో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.
నాని ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాకు నేను కోర్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వాడిన డైలాగ్ ను వాడనని తెలిపారు.నన్ను నేను తాకట్టు పెట్టుకోగలనని వాళ్లు ఎవరినో ఎందుకు పెడతానని ఆయన తెలిపారు.హిట్3 తరహా జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మే నెల 1వ తేదీన ఫుల్ మీల్స్ పక్కా అని నాని చెప్పుకొచ్చారు.ఈ సినిమా కొత్త థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు.

ఇది కనుక తప్పని మీకు అనిపిస్తే నెక్స్ట్ టైమ్ నానిని నమ్మవద్దని నాని వెల్లడించారు.న్యాచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా సత్తా చాటుతున్నారు.న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.నాని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

నాని ది ప్యారడైజ్( The Paradise ) సినిమా కూడా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటున్న న్యాచురల్ స్టార్ నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.