ఇండియన్ సినిమా ఇండస్ట్రిలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే వస్తుంది.ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన వాళ్ళు సైతం ఇప్పుడు అవకాశాలు లేక ఇంట్లో కూర్చునే సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇక ఇలాంటి సందర్బంలోనే యాక్టర్ రాజశేఖర్( Actor Rajasekhar ) లాంటి నటుడు సైతం ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు.

ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన తర్వాత కాలంలో చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నప్పటికి అతనితో సినిమాలు చేయడానికి ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.మరి సినిమాల్లో నటించాలని దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నప్పటికి ఆయనకి అవకాశాలను ఇచ్చే వారు ఎవరు లేకపోయారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా రాజశేఖర్ లాంటి నటుడు ఎప్పటికప్పుడు చిరంజీవితో( Chiranjeevi ) గొడవలు పెట్టుకుంటూనే వచ్చాడు.అందువల్లే ఆయన కెరీర్ అనేది జరుగుతూ వచ్చింది అలా కాకుండా సైలెంట్ గా తను సినిమాలు తను చూసుకొని ఉంటే ఆయన కూడా ఆరోజుల్లో టాప్ హీరోగా ఎదిగేవాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండటం విశేషం.ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నప్పటికీ రాజశేఖర్ లాంటి గొప్ప నటుడు మరొకరు ఉండరు అనేది వాస్తవం ఆయన ఒకప్పుడు చేసిన అంకుశం, అన్న, అల్లరి ప్రియుద్, మా అన్నయ్య లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
మరి ఏది ఏమైనా కూడా ఆయన సినిమా వస్తుందంటే చాలు ఒకప్పుడు ప్రేక్షకులంతా ఆసక్తి గా ఎదురుచూసేవారు.కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి.సినిమా ఇండస్ట్రీ లో అతనికి అవకాశాలు దొరకడం లేదు…
.