అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) 1,000కి పైగా సినిమాల్లో కామెడీ పండించి తెలుగు ప్రేక్షకులలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.ఈ కమెడియన్ కుమారుడైన అల్లు అరవింద్( Allu Aravind ) అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.
ఇక అల్లు అరవింద్ కుమారుడైన అల్లు అర్జున్( Allu Arjun ) మంచి కథలతో ఆకట్టుకునే సినిమాలు చూస్తూ వినోదాన్ని పంచుతున్నాడు.మొత్తంగా అల్లు ఫ్యామిలీ టాలీవుడ్ ప్రేక్షకులతో ఎంతో మంచి అనుబంధం ఏర్పరచుకుంది.
తాజాగా అల్లు రామలింగయ్య హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ సందర్భంగా అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అల్లు రామలింగయ్యకు సంబంధించి అడిగిన కొన్ని ప్రశ్నలకు అల్లు అరవింద్ సమాధానం ఇస్తూ.“మా నాన్న వెయ్యికి పైగా సినిమాలు చేశాడని తెలుసు కానీ కచ్చితంగా ఎన్ని సినిమాలు చేశాడనేది తెలియదు.అసలు ఆ కౌంట్ కూడా మిస్సయింది.
అల్లు రామలింగయ్య ఎంత చదివాడు అని అడిగితే, టెన్త్ పూర్తి కాలేదని చెప్తాను.ఎంత చదివాడనేది కరెక్ట్ గా తెలియదు.ప్రైమరీ స్కూలింగ్ వరకే చదువుకున్నట్టు ఉన్నాడు.” అని చెప్పుకొచ్చాడు.

హోమియోపతి వైద్యం( Homeopathy ) చేయాలని ఆలోచన రామలింగయ్య కు స్వతహాగా వచ్చిందా లేదంటే ఎవరైనా సలహా ఇచ్చారా అని అడిగితే.“నారాయణమూర్తి ( Narayanamurthy ) అనే వ్యక్తి మా నాన్నకి తెలుసు.ఆయన లాయర్, అలాగే హోమియోపతి డాక్టర్.వారి దగ్గర నుంచే హోమియోపతి వైద్యం నేర్చుకున్నారు.తర్వాత సినిమాల్లో పడి బిజీ అయిపోయారు.అనంతరం హోమియోపతి నేర్చుకున్న వారికి ఎగ్జామ్ పెట్టి రిజిస్టర్డ్ రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్ గా సర్టిఫికెట్ అందజేస్తామని ప్రకటన చూశారు.
ఆ పరీక్ష రాసి అందులో పాసయ్యారు.ఏదో పదో తరగతి పాస్ అయిన కుర్రాడిలా ఆ సర్టిఫికెట్ పట్టుకుని దాన్ని మాకు చూపించేవారు.” అని అల్లు అరవింద్ తెలిపాడు.

దీని గురించి ఇంకా మాట్లాడుతూ.“మమ్మల్ని వైద్యం నేర్చుకోవాలని ఎప్పుడూ అడగలేదు కానీ సురేఖ వాణి( Surekha Vani ) సిస్టర్, నాక్కూడా సిస్టర్ అయిన వసంతి లక్ష్మి( Vasantha Lakshmi ) నాన్న పక్కన ఉంటూ హోమియోపతి పుస్తకాలు చదువుతూ ఉండేది.హోమియోపతి చికిత్సలో చాలా అసిస్ట్ చేస్తూ ఉండేది.
రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అవ్వలేదు కానీ ఆమెకు హోమియోపతి వైద్యం కొంతవరకు తెలుసు అని వెల్లడించాడు.