మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
జనగాం జిల్లాలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజాశీర్వాద సభా వేదికగా పొన్నాల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి జనగాం నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన పొన్నాల లక్ష్మయ్య ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.







