Maha Shivratri : మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు ఏం తినాలో.. ఏం తినకూడదో.. తెలుసా..?

హిందూమతంలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మహాశివరాత్రి( Maha Shivratri ) పండుగ రోజున శివుని( Lord shiva )కి ప్రత్యేక పూజలు చేస్తారు.అంతేకాకుండా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఆ రోజున ఉపవాసం కూడా ఉంటారు.

 Do You Know What To Eat And What Not To Eat On Mahashivratri-TeluguStop.com

అయితే మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించే వ్యక్తులు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి.ఎందుకంటే చిన్న పొరపాటు కారణంగా కూడా ఉపవాసం అసంపూర్ణం అవుతుంది.

అయితే శివయ్యను భక్తిశ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి అని చెబుతారు.మీరు కూడా శివరాత్రి నాడు ఉపవాసం చేయబోతున్నట్లయితే ఉపవాస సమయంలో ఏమి తినాలో ఏమి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Apple, Banana, Devotional, Garlic, Lord Shiva, Maha Shivratri, Orange, Pa

శివరాత్రి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస సమయంలో ఆపిల్, అరటిపండు, నారింజ, దానిమ్మ లాంటి పండ్లను తీసుకువచ్చిని చెప్పారు.ఇది శరీరం శక్తిని కాపాడి కడుపు నిండుగా ఉంచుతుంది.ఇది కాకుండా ఉపవాసంతో ఉన్నవారు కొత్తిమీర, జీలకర్ర, సోంపు లాంటి ధాన్యాలను కూడా తీసుకోవచ్చు.శివరాత్రి రోజున ఉపవాసం పాటించడం ముఖ్యమైనదని, వ్రతం పాటిస్తే నీటిని సేవిస్తారని తెలిపారు.

సాగో కిచిడీ లేదా పండ్లను ఉపవాసం రోజున తీసుకోవచ్చు.ఇక మహాశివరాత్రి ఉపవాస సమయంలో తాండై కూడా తాగవచ్చు.

Telugu Apple, Banana, Devotional, Garlic, Lord Shiva, Maha Shivratri, Orange, Pa

ఇవి కడుపులోని వేడిని తొలగించడంలో సహాయపడుతుంది.శివ భక్తులకు తాండై ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు.ఇక ఉపవాస సమయంలో పిండి పదార్థాలను కూడా తినవచ్చు.పిండితో చేసిన హల్వా పూరి లేదా పరాటా( Paratha ) కూడా తయారుచేసి తినవచ్చు.ఉపవాస సమయంలో దీన్ని తినడం వలన బలహీనంగా అనిపించదు.ఉపవాస సమయంలో డ్రై ఫ్రూట్స్ తినడం కూడా చాలా మంచిది.

మహాశివరాత్రి ఉపవాసం సమయంలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, మఖనా మొదలైనటువంటివి కూడా తీసుకోవచ్చు.అయితే మహాశివరాత్రి ఉపవాసం పాటించేవారు పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయలు అస్సలు తీసుకోకూడదు.

ఈరోజు తెల్ల ఉప్పు కూడా అస్సలు తినకూడదు.అంతేకాకుండా మహాశివరాత్రి వ్రతంలో బియ్యం, గోధుమలు, బార్లీ, మినుము, మొక్కజొన్న మొదలైన ధాన్యాలు అస్సలు తినకూడదు.

అలాగే వేరుశనగ, శనగలు, కిడ్నీ బీన్స్, పెసలు మొదలైన వాటిని కూడా తినకూడదు.అంతేకాకుండా ఉపవాసం సమయంలో ముఖ్యంగా మాంసాహారం అస్సలు తీసుకోకూడదు.

మరీ ముఖ్యంగా మద్యం అస్సలు సేవించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube