ముఖ్యంగా చెప్పాలంటే పండితులు చంద్రగ్రహణం లేదా సూర్య గ్రహణాలను ఆధ్యాత్మిక కోణం నుంచి కూడా చూస్తూ ఉంటారు.అలాగే చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 29వ తేదీన సంభవిస్తుంది.
ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం ఇదే.అలాగే చంద్రగ్రహణం( Lunar eclipse ) భారత దేశంలో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో కనిపిస్తుంది.ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది కాబట్టి దానీ సుతక కాలం భారత దేశంలో కూడా చెల్లుతుంది.ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ రోజు( Vaishakh Purnima )న సంభవించింది.
ఈ గ్రహణం ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో కనిపించింది.కానీ భారతదేశంలో అసలు కనిపించలేదు.
అయితే చివరి చంద్రగ్రహణం మాత్రం అక్టోబర్ 29 ఆదివారం రోజు రాత్రి 1:05 నిమిషముల నుంచి రెండు గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది.అక్టోబర్ 29న ఈ చంద్రగ్రహణం భారత దేశంలో కనిపిస్తుంది.అందువల్ల దానీ సుతక కాలం కూడా ఇక్కడ చెల్లుతుంది.ఈ కాలంలో పూజలు, పారాయణం మొదలైన శుభకార్యాలు నిషేధించారు.సూతకం ప్రతిష్టించబడిన వెంటనే ఆలయాల తలుపులు మూసి వేయబడతాయి.ఈ కాలంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు.
గ్రహణ సమయంలో ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టి భగవంతుని ధ్యానించాలి.
గ్రహణం ముగిసిన తర్వాత స్నానం, ధ్యానం చేసి ఆహారం తీసుకోవాలి.జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో ఇది సముద్ర మథనం రాహువు కేతువు కథతో ముడిపడి ఉంటుంది.కాబట్టి హిందూమతం దృక్కోణం నుంచి గ్రహణం యొక్క ఘటన శుభప్రదంగా పరిగణించబడదు.
ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియాలోని అనేక దేశాలలో కనిపిస్తుంది.జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సుతాక కాలం 9 గంటల ముందు మొదలవుతుంది.
అయితే సూర్యగ్రహణం సుతకా కాలం 12 గంటల ముందు మొదలవుతుంది.ముఖ్యంగా సుతక కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL