వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లులు, కుక్కలు, కాకులు ఇలా మొదలైన జీవులు ఎదురుపడినప్పుడు, లేదంటే కలలో కనిపించినప్పుడు అనేక రకాల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.అలాగే బయటకు వెళ్తున్నప్పుడు ఎదురుపడితే ఒక విధమైన ఫలితం, అలాగే కలలో కనిపించడం వల్ల ఒక విధమైన ఫలితాలు కలుగుతాయిని పండితులు చెబుతున్నారు.
పాములను( Snakes ) చూస్తే కూడా శుభ, అశుభ శకునాలు ఉన్నాయని, పాములను ఏ సమయంలో చూడవచ్చో, ఏ సమయంలో చూడకూడదు వంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే పాములు పక్కగా వెళ్తే ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పొలాలకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాలలో పాములను చూస్తూ ఉంటాము.ఒక్కోసారి మన పక్క నుంచే పాములు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి.
పాములు ఏవిధంగా కనిపిస్తే మనకు కలిసి వస్తుంది.ఎలా కనిపిస్తే మనకు నష్టం కలుగుతుంది వంటి అంశాలను పరిశీలించినట్లయితే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు పాములు మన పక్కనుండి కుడి వైపుకు వెళితే మనకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఏ పని మీద అయితే మనం బయలుదేరి వెళ్తామో ఆ పని కచ్చితంగా పూర్తి అవుతుంది.అది మనకు అదృష్టాన్ని( Luck ) తీసుకొస్తుంది.పాములు మన పక్కగా కుడి వైపుకు వెళ్ళినప్పుడు ఊహించని లాభాలు చోటు చేసుకుంటాయి.పాములు చెట్టుపైకి పాకుతున్నట్లు( Crawling Trees ) కనిపిస్తే కలిగే శుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే ఎక్కడైనా పాము ఏదైనా చెట్టు పైకి కానీ గోడ పై కానీ ఎక్కుతున్నట్లు కనిపిస్తే అది కూడా మనకు శుభశకునం భావించాలి.
పాము చెట్టు పైకి కానీ,గోడ పైకి కానీ ఎక్కుతున్నట్టుగా కనిపిస్తే అది మన ఎదుగుదలను సూచిస్తుంది.
అంతే కాకుండా చెట్టు పై నుంచి కిందకు పాము దిగుతున్నట్లు మనకు కనిపిస్తే అది కూడా శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.ఇలాంటి సంఘటన చూసినప్పుడు ఊహించని ఆకస్మిక ధన లాభం మనకు కలుగుతుంది.పాముల విషయంలో రెండిటిని మనం చూస్తే అ శుభ శకునంగా భావించాలి.
ఒకటి చనిపోయిన పాములు చూస్తే అది అశుభసంకేతమని పండితులు చెబుతున్నారు.ఆ తర్వాత శివుడికి పూజలు, అర్చనలు చేయడం మంచిదని చెబుతున్నారు.
DEVOTIONAL