Obesity : పిల్లలలో ఊబకాయం పోవాలంటే.. తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి..!

ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ మరియు అధిక కేలరీల ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.ప్రపంచ ఊబకాయం దినోత్సవం ప్రతి ఏడాది మార్చి నెలలో జరుపుకుంటారు.

 To Prevent Obesity In Children Parents Should Remember These Things-TeluguStop.com

నిశ్చల జీవన శైలి మరియు పేలవమైన ఆహారపు అలవాట్లు బరువు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఊబకాయం( Obesity ) కూడా పిల్లలలో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.

అలాగే రోజురోజుకు ఈ సమస్య చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు పెరిగిపోతూనే ఉంది.ప్రస్తుత రోజులలో చాలా మంది చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీల ముందు గడుపుతున్నారు.

పిల్లలలో స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల ఊబకాయం వస్తుంది.అనారోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు పస్ట్ ఫుడ్ మరియు అధిక కేలరీలు ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లల ఊబకాయం తగ్గించుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

Telugu Tips, Junk, Obesity, Smartphone, Sweets-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు జంక్ ఫుడ్ మరియు స్వీట్లు( Junk food, sweets )తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.పిల్లలను ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంచాలి.అదే సమయంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినలే చూసుకోవాలి.

అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి.పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం కూడా ఊబకాయం మరియు జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పిల్లలు మొబైల్ స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కంట్రోల్ చేయాలి.టీవీ చూస్తూ తినడం అస్సలు చేయకూడదు.

Telugu Tips, Junk, Obesity, Smartphone, Sweets-Telugu Health

నడక, సైక్లింగ్ మరియు అవుట్ డోర్ గేమ్ లు అలవాటు చేసుకోవాలి.వాకింగ్ ప్లాన్ లో నడక, సైక్లింగ్ మరియు అవుట్ డోర్ ఆటలు ఉండేలా చూసుకోవాలి.దీంతో పిల్లలలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుంది.ఆరోగ్యకర అలవాట్లను పిల్లల్లో ముందుగానే పెంచాలి.అలాగే అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా వారిని అదుపు చేయాలి.ఫాస్ట్ ఫుడ్స్, సోడాలు, స్వీట్లు మరియు ప్రాసెస్ చేసిన స్టాక్స్ వినియోగాన్ని తగ్గించాలి.

అలాగే నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.ఇది ఆకలిని పెంచుతుంది.

కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతి రోజు బాగా నిద్రపోయేలా చూసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube