పెరుగు. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.పాల నుంచి వచ్చే ఉత్పత్తుల్లో పెరుగు ఒకటి.అయితే పెరుగు పాల కంటే రుచిగా ఉండటమే కాదు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.ఆరోగ్యపరంగా మరియు సౌందర్య పరంగా పెరుగు అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.అయితే కేశ సంరక్షణకు సైతం పెరుగు అద్భుతంగా సహాయపడుతుంది.
అసలు పైసా ఖర్చు లేకుండా పెరుగుతో ఏయే జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మందిని కామన్ గా వేధించే సమస్య చుండ్రు.
అయితే చుండ్రుతో బాధపడేవారు గుప్పెడు వేపాకులను తీసుకుని ఒక గ్లాస్ వాటర్ లో వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.అనంతరం వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక కప్పు పెరుగులో ఈ వేపాకుల నీటిని పోసి బాగా మిక్స్ చేసి తల మొత్తానికి పట్టించాలి.గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు కనుక చేస్తే చుండ్రు దెబ్బకు పోతుంది.
అలాగే హెయిర్ ఫాల్ తో సతమతం అవుతున్నవారు ఒక కప్పు పెరుగులో, ఒక ఫుల్ ఎగ్ మరియు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తల స్నానం చేయాలి.ఈ రెమెడీని కనుక వారంలో ఒకటి లేదా రెండు సార్లు పాటిస్తే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి.దాంతో హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.
ఇక కప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి గంట అనంతరం తల స్నానం చేయాలి.
ఇలా తరచూ కనుక చేస్తే డ్రై హెయిర్, హెయిర్ డామేజ్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.మరియు జుట్టు సిల్కీ అండ్ షైనీ గా సైతం మెరుస్తుంది.