బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంది నటీనటులు మంచి ఆదరణ సిద్ధం చేసుకున్నారు.ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో పరిటాల నిరుపమ్ ( Nirupam Paritala ) ఒకరు.
అసలు పేరు చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు.కార్తీకదీపం( Karthika Deepam ) సీరియల్ లో నటించిన ఈయన గుర్తుకొస్తారు.
నిరుపమ్ పలు బుల్లితెర సీరియల్స్ చేసినప్పటికీ ఈయనకు మాత్రం కార్తీక దీపం సీరియల్ ఎన్నో అద్భుతమైన ఆదరణ తీసుకువచ్చింది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ త్వరగా ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా ఒక వైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు నిరుపమ్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం(Aadivaaram With Star Maa Parivaaram ) అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజాగా ఒక ప్రోమో వీడియోని విడుదల చేశారు.
ఈ ప్రోమో వీడియోలో భాగంగా యాంకర్ శ్రీముఖి( Sreemukhi ) సమ్మర్ స్పెషల్ షోలో ఉండే టాస్క్ లను వివరించింది.ఈ సారి టాస్క్ ల్లో గెలిచిన విన్నర్ కు కాశ్మీర్ ట్రిప్ గురించి వివరించారు.

ఇక ఈ సమ్మర్ స్పెషల్ షో లో నిర్వహించే టాస్కుల గురించి ఆమె మాట్లాడుతూ…నిరుపమ్ వయసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.36 ఏళ్ల యంగ్ యాక్టర్ ను పట్టుకొని అంకుల్ అంటూ , డాక్టర్ బాబును ముసలోడిని చేసేసింది.ప్రస్తుతం నిరుపమ్ గురించి శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈమె వ్యాఖ్యలపై డాక్టర్ బాబు అభిమానులు, నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.నిరుపమ్ విషయానికి వస్తే ఈయన పలు సీరియల్స్ తో పాటు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
అదే విధంగా మరికొన్ని సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.