ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్( Raj Tarun ) గురించి సంచలన ఆరోపణలు చేయడం ద్వారా లావణ్య( Lavanya ) వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా లావణ్య ఒక సందర్భంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజ్ తరుణ్, శేఖర్ భాషా( Sekhar Basha ) నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని లావణ్య పేర్కొన్నారు.తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె నార్సింగి పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ అవుతోంది.
మా కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ఇటీవల నాపై కొంతమంది దాడికి పాల్పడ్డారని ఆమె కామెంట్లు చేశారు.దాంతో నేను పోలీసులను ఆశ్రయించానని లావణ్య వెల్లడించారు.ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతి నిమిషం ప్రాణ భయంతో బ్రతుకుతున్నానని లావణ్య అన్నారు.
నిన్న సాయంత్రం కూడా నలుగురు మహిళలు నా ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని ఆమె తెలిపారు.

నా ప్రాణం పోయాక వారిని పట్టుకుంటారా అని లావణ్య వెల్లడించారు.మాకు తెలిసిన ఒక వ్యక్తి నుంచి సుమారు నాలుగేళ్ల క్రితం రాజ్, నేను 55 లక్షల రూపాయల అప్పు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు.గొడవల వల్ల సుమారు రెండేళ్ల నుంచి వడ్డీ నుంచి చెల్లించడం లేదని లావణ్య పేర్కొన్నారు.
అప్పు ఇచ్చిన వారు ఇటీవల ఫోన్ చేసి డబ్బు తిరిగి ఇవ్వమన్నారని ఆమె వెల్లడించారు.