ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చలి పులి రోజురోజుకు తీవ్రతరంగా మారుతుంది.
అయితే ఈ సీజన్ లో సాధారణంగా కొందరికి చలిని తట్టుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది.దీని వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ముఖ్యంగా రాత్రుళ్ళు చలికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు డైట్ లో చేర్చుకుంటే.
అవి శరీరానికి చక్కటి వెచ్చదనాన్ని అందిస్తాయి.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
వేరుశనగలు.
ఇవి రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషక విలువలను సైతం కలిగి ఉంటాయి.ప్రస్తుత చలికాలంలో వేరుశనగలు ఆరోగ్యానికి రక్షణ కవచంలా వ్యవహరిస్తాయి.
రోజుకు గుప్పెడు వేరుశనగలను తింటే చలిని తట్టుకునే శక్తి లభిస్తుంది శరీరం వెచ్చగా మారుతుంది.
అలాగే ప్రస్తుత చలికాలంలో బాడీలో హీట్ పుట్టించే ఆహారాల్లో ఉసిరి ఒకటి.
ఫ్రెష్ ఉసిరి కాయలతో టీ తయారు చేసుకుని తాగడం లేదా స్మూతీలలో కలిపి తీసుకోవడం చేస్తే ఎంతటి చలినైనా తట్టుకోగలిగే సామర్థ్యాన్ని పొందుతారు.

కొంచెం చలికి కూడా తట్టుకోలేని వారు ప్రతి రోజు రెండు అంజీర్ పండ్లు వాటర్ లో వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే బ్లెండర్ తీసుకుని అందులో నానపెట్టుకున్న అంజీర్ పండ్లను వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ బాదాం పాలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి సేవించాలి.
ఇలా తీసుకుంటే శరీరం వెచ్చగా మారుతుంది.దీంతో చలిని సులభంగా జయించవచ్చు.
ఇక ప్రస్తుత చలి కాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో బెల్లం ఒకటి.రోజుకు చిన్న బెల్లం ముక్కను తీసుకుంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.మరియు రోగ నిరోధక వ్యవస్థ ను సైతం బలోపేతం చేస్తుంది.