ప్రస్తుత రోజుల్లో మధుమేహం బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.ఇంటికి కనీసం ఒక్కరైనా సరే మధుమేహంతో బాధపడుతున్న వారు ఉంటున్నారు.
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు, ఒత్తిడి, శరీరానికి శ్రమ లేకపోవడం వంటివి మధుమేహం బారిన పడటానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.కారణం ఏదైనా సరే మధుమేహం( Diabetes )క్కసారి వచ్చింది అంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే.
పైగా మధుమేహం వల్ల కొందరు తరచూ నీరసంతో చాలా బాధపడుతూ ఉంటారు.
ఆ నీరసాన్ని జయించలేక సతమతం అయిపోతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? నీరసం ( Boredom )విపరీతంగా పట్టిపీడిస్తుందా.? అయితే మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ కచ్చితంగా ఉండాల్సిందే.ఈ స్మూతీ నీరసాన్ని తరిమి కొడుతుంది.
మిమ్మల్ని ఎల్లప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక యాపిల్ ( Apple )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ పండు ముక్కలు, రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) ఒక గ్లాస్ హోమ్ మేడ్ ఓట్స్ మిల్క్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క ( Cinnamon )పొడి, నాలుగు ఐస్ క్యూబ్స్ ( Ice cubes )వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే మన స్మూతీ సిద్ధం అయినట్టే.
మధుమేహంతో బాధపడుతున్న వారికి ఈ ఓట్స్ ఆపిల్ స్మూతీ చాలా మేలు చేస్తుంది.ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని తీసుకుంటే నీరసం మీ దరిదాపుల్లోకి కూడా రాదు.పైగా ఈ స్మూతీ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమాత్రం పెరగవు.నిశ్చింతగా ఈ స్మూతీని తీసుకోవచ్చు.ఈ స్మూతీలో ఉండే డైటరీ ఫైబర్ షుగర్ లెవెల్స్ ను స్టడీగా మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.అలాగే ఐరన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు మీ బాడీని హెల్తీగా ఉంచుతాయి.
అనేక జబ్బులకు అడ్డుకట్ట వేస్తాయి.