ఎముకలు దృఢంగా ఉండాలా? అయితే ఈ ఆహారానికి స్వస్తి చెప్పండి ఇక!

ఈ మానవ శరీరంలోని ఎముకలు ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు.ఇవి బాగున్నంత వరకే మనిషి మనుగడ.

 Should Bones Be Strong But Put An End To This Food ,bones, Bones Health, Health-TeluguStop.com

ఒక్కసారి ఎముకలు బలహీన ( Bones weak )పడి విరిపోయాయి అంటే ఇక మూలాన కూర్చోవలసిందే.అపుడు కట్టుకున్న పెళ్ళానికి కూడా భారం అవుతాం.

అందుకే ఆరోగ్యకరమైన జీవితానికి ఏమి అవసరమో అది చేస్తే కలకాలం సంతోషంగా గడిపేయొచ్చు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎముకలు( bones ) అన్ని సమయాలలో మారుతూ ఉంటాయి.పాత ఎముకలు విరిగిపోతూ, కొత్తవి ఏర్పడుతూ వుంటాయని విషయం మీకు తెలుసా?

దీని కారణంగానే మనం బరువు పెరగడం, తగ్గడం అనేది జరుగుతుంది.30 సంవత్సరాల వయస్సులో, పాత ఎముకలు విరిగిపోతాయి.ఆ స్థానంలో కొత్త ఎముకలు ఏర్పడతాయి.మన శరీరంలో దాదాపు 1200 గ్రాముల కాల్షియం లభిస్తుంది, అందులో 99% ఎముకలలో లభిస్తుంది, మిగిలిన 1% దంతాలు, కండరాలు, గుండె , నరాలను నిర్వహించడానికి ఉపయోగించబడుతుందని మనం చదువుకొనే వున్నాం కదా.ఎముకలు దృఢంగా మారడానికి కాల్షియం తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కాల్షియం లోపాన్ని తీర్చడానికి పాలు, చీజ్, పెరుగు( Milk, cheese, curd ) వంటి పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

అయితే కాల్షియం శోషణను అడ్డుకునే.ఎముకల నష్టాన్ని కలిగించే కొన్ని ఆహారాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, శీతల పానీయాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు మెత్తబడతాయి.శీతల పానీయాలలో చక్కెర, కెఫిన్ , ఫాస్ఫారిక్ యాసిడ్ ఎముకలలో ఉండే కాల్షియంను దారుణంగా దెబ్బతీస్తాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, జంతువుల మాంసం తినడం వలన కూడా ఎముకలు దెబ్బతింటాయి.

ఎందుకంటే యానిమల్ ఎక్కువగా ప్రొటీన్ తీసుకోవడమే దానికి కారణం.అంతేకాకుండా టీ, కాఫీ, కోకో, చాక్లెట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కాల్షియం విసర్జన పెరుగుతుంది.

ఇంకా ఉప్పు, పంచదార, పొగాకు వాడకం వల్ల ఎముకలు బలహీనపడతాయి.కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube