కష్టపడి కట్టుకున్న ఇల్లుపై హమాస్‌ బాంబు దాడి.. ఎక్కెక్కి ఏడ్చిన ఇజ్రాయెల్ మహిళ...

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడు ఐదవ రోజుకు చేరుకుంది.ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాకెట్లు, క్షిపణులు ప్రయోగిస్తూనే ఉన్నారు.

 We Lost Everything Israeli Woman Breaks Down After House Gets Bombed By Hamas De-TeluguStop.com

ఎవరూ తగ్గేటట్లు కనిపించకపోవడంతో సామాన్య ప్రజలు బలవుతున్నారు.తాజాగా ఇజ్రాయెల్‌లోని( Israel ) అష్కెలోన్ నగరంలో నివసిస్తున్న నాన్సీ( Nancy ) అనే మహిళ హమాస్ రాకెట్ దాడిలో తన ఇంటిని కోల్పోయింది.

బుధవారం ఇండియన్ న్యూస్ విలేకరులతో మాట్లాడిన ఆమె కన్నీరుమున్నీరైంది.ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ధ్వంసం అయిందని, దాంతో తాము సర్వశం కోల్పోయామని ఆమె ఏడ్చింది.

Telugu Air, Hamas, Hamasmissile, Holocaust, Israel, Nancy, Nri-Telugu NRI

నాన్సీ ఇంటిని ధ్వంసం చేసిన బాంబు భాగాలు ఇప్పటికీ శిథిలాల బయట పడి ఉన్నాయి.నాన్సీ మాట్లాడుతూ “మేం భయపడుతున్నాం, ప్రతిదీ కోల్పోయాం, మా పిల్లలు చాలా చిన్నవారు.” అని ఏడ్చింది.నాన్సీ తన కుటుంబం కేవలం ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటుందని, అయితే దాడి తర్వాత తన పిల్లలు భయపడుతున్నారని తెలిపారు.

ఇకపై వారు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేరు.వారి హృదయాలను ఎలా బాగుచేయాలో నాకు తెలియడం లేదని ఆమె చెప్పింది.

Telugu Air, Hamas, Hamasmissile, Holocaust, Israel, Nancy, Nri-Telugu NRI

ఈ దాడుల్లో తన సోదరి ఇల్లు కూడా ధ్వంసమైందని నాన్సీ చెప్పింది.ఎక్కడికి వెళ్లినా అగ్ని, విధ్వంసమే కనిపిస్తోందని చెప్పింది.ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న సమయంలో రాకెట్ దాడి( Air Strike ) జరిగిందని, అలారం మోగిన కొద్దిసేపటికే, తన ఇంటిపై భారీ బాంబు పడిందని నాన్సీ చెబుతూ విలపించింది.మంటలు వ్యాపిస్తాయనే భయంతో తన పిల్లలను ఇంటి నుండి దూరంగా తీసుకెళ్లాలని తన మొదటి ఆలోచన అని నాన్సీ తెలిపింది.

ఆమె తన పిల్లలను ఇరుగుపొరుగు వారి వద్దకు తీసుకువెళ్లింది, ఆమె సహాయం కోసం తన భర్త అరుపులను విన్నది.నాన్సీ హమాస్ దాడులను హోలోకాస్ట్‌తో( Holocaust ) పోల్చారు.

దేవుడు తనకు సహాయం చేస్తాడని తాను ఆశిస్తున్నానని అన్నారు.ఇకపోతే యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3,000 దాటింది, ఇందులో రెండు వైపుల ప్రజలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube