చలికాలంలో ఆరోగ్యానికి అండగా, కడుపును నిండుగా ఉంచే బెస్ట్ స్మూతీ మీ కోసం!

సాధారణంగా ప్రస్తుత ఈ చలికాలంలో( winter ) చాలా మంది వాటర్ తాగేందుకు ఇష్టపడరు.శరీరానికి సరిపడా నీటిని అందించ‌క‌పోతే డీహైడ్రేట్ అవుతారు.

 Best Winter Smoothie For Good Health And Weight Loss! Winter Smoothie, Winter, S-TeluguStop.com

అలాగే ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతాయి.కాబట్టి వాటర్ త్రాగాలనే ఆలోచన లేకపోతే మీరు ఆరోగ్యకరమైన స్మూతీలను ఎంపిక చేసుకోవచ్చు.

స్మూతీలు మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ కూడా ఒకటి.ఈ స్మూతీని తీసుకుంటే చలికాలంలో ఆరోగ్యానికి అండగా, కడుపుకు నిండుగా ఉంటుంది.

మరి ఇంతకీ ఈ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక అరటి పండును( Banana fruit ) తీసుకొని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.అలాగే నాలుగు నుంచి ఐదు ఫ్రెష్ పాలకూర ఆకులు( Lettuce leaves ), రెండు టేబుల్ స్పూన్లు ఆల్మండ్ బటర్( Almond butter ) వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి మరియు ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదంపాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్పినాచ్ బనానా ఆల్మండ్ స్మూతీ రెడీ అవుతుంది.

Telugu Bananaspinach, Tips, Smoothie-Telugu Health

ప్రస్తుత చలికాలంలో ఈ స్మూతీ( Smoothie ) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల అతి ఆకలి దూరం అవుతుంది.కడుపు నిండుగా ఉంటుంది.

దాంతో చిరు తిళ్ళుపై మనసు మళ్లకుండా ఉంటుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

అలాగే ఈ స్మూతీలో వాడిన అల్లం, జాజికాయ పొడి( Ginger , nutmeg powder ) మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.చలిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తాయి.

సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.

Telugu Bananaspinach, Tips, Smoothie-Telugu Health

అంతేకాకుండా పాలకూర, బాదం, అరటిపండు వంటి ఆహారాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.కంటి చూపును పెంచుతాయి.రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

నీరసం, అలసట వంటివి దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తాయి.మరియు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube