సాధారణంగా చాలా మంది ముఖంపై పెట్టిన శ్రద్ధ.మెడపై పెట్టరు.
కానీ, అందంగా, యవ్వనంగా కనిపించాలంటే.ముఖంతో పాటు మెడ కూడా ఆకర్షణీయంగా ఉండాలి.
అయితే చాలా మందికి మెడపై ముడతలు ఏర్పడతాయి.ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు.
మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీములను ఉపయోగిస్తారు.కానీ, మెడపై ముడతలు మాత్రం తగ్గవు.
అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సింపుల్ టిప్స్ ట్రై చేస్తే ఖచ్చితంగా ముడతల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా బాగా పండిన అరటి పండు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి.ఈ అరటి పండు పేస్ట్‌లో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి.అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలలి.
ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల మెడపై ఉన్న ముడతలు పోయి.చర్మం యవ్వనంగా మారుతుంది.

రెండొవది.ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా శనగపిండి మరియు పాల మీగడ వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి.బాగా ఆరనివ్వాలి.అరగంట అనంతరం చల్లటి నీటితో మెడను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే.
మెడపై ముడతలు క్రమంగా తగ్గిపోతాయి.అలాగే మెడ మృదువుగా, తెల్లగా కూడా మారుతుంది.
ఇక మెడపై ముడతలను నివారించడంలో బొప్పాయి అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి, ముందుగా బాగా పండిన బొప్పాయి ముక్కులను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి.ఆ బొప్పాయి పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి.మెడకు బాగా అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
తరచూ ఇలా చేయడం వల్ల కూడా మెడపై ముడతలు తగ్గుతాయి.