దేవుని దగ్గర కోరుకొనే కోరికను బయటకు చెప్పకూడదు....ఎందుకో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్లిన, ఇంటిలో పూజ చేసుకున్న ఎదో ఒక కోరిక కోరుకోవటం సాధారణమే.ఆ కోరిక పెద్దది అయినా చిన్నది అయినా సరే బయటకు చెప్పకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు.

 The Desire To Be Close To God Should Not Be Expressed Out Loud Do You Know Why,-TeluguStop.com

ఆలా బయటకు ఎందుకు చెప్పకూడదో అనే దానికి కూడా ఒక కారణం ఉంది.ఆ కారణం గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం.

దేవుణ్ణి మనం కోరిక కోరుకున్నాం అంటే అది మనకు సాధ్యం కానిదే అయ్యింటుంది.

అలాంటి కోరికను భగవంతుడు తీరిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు.

ఒకవేళ మనం కోరుకున్న కోరికను బయటకు చెప్పితే విన్నవారు బయటకు ఆనందంగా ఉన్నా లోపల మాత్రం ఆ కోరిక నెరవేరకూడదని అనుకుంటారు.ఆ కోరిక మనకు తీరకుండా ఉండటానికి మానవ ప్రయత్నం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.

అందుకే మన పెద్దవారు ఏ ఆచారం పెట్టిన బాగా అలోచించి మాత్రమే పెడతారు.మన పెద్దవారు పెట్టే ఆచారాలు అన్నిటిలోను పరమార్ధం ఉంటుంది.

Telugu Devotional, Express, Pooja, Teertham, Telugu Bhakthi, Temple, Wishes, Wis

ఆయితే గుడికి వెళ్ళినప్పుడు తీర్ధం నిల్చుని మాత్రమే తీసుకోవాలి.అదే ఇంటిలో అయితే కూర్చుని తీసుకోవచ్చు.చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని దండం పెడుతూ ఉంటారు.ఆలా చేయటం తప్పు.గుడికి వెళ్లిన వెంటనే స్వామిని తనివితీరా చూసి ఆ తర్వాత మాత్రమే కళ్ళు మూసుకొని మన మనస్సులోని కోరికలను దేవునికి నివేదించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube