ధర్మవరపు సుబ్రహ్మణ్యం( Dharmavarapu Subrahmanyam ) .తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ కమెడియన్ గా అయన చాల ఏళ్ళ పాటు ఒక వెలుగు వెలిగాడు.1989 లో బావ బావ పన్నీరు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు.ఇక అక్కడ మొదలు పెట్టిన సినిమా ప్రయాణం అయన కన్ను మూస్ వరకు కూడా కొనసాగింది.
వందల సినిమాల్లో నటించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎప్పుడు కూడా సినిమా డైరెక్ట్ చేయాలనే ఆశతో ఉండేవారు.అందుకే అయన సీనియర్ హీరో నరేష్( Naresh ) తో తోకలేని పిట్టా అనే ఒక సినిమాకు దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా ఒక డీసెంట్ చిత్రం అయినప్పటికీ కలెక్షన్స్ పరంగా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.ఇక ఈ సినిమాకు నిర్మాత గా కోన వెంకట్( Kona Venkat ) వ్యవహరించగా, హీరోయిన్ గా నివేదిత జైన్ నటించింది.
అయితే ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు అయన రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్లారట.

అయితే కథ మొత్తం విన్న తర్వాత చాలా బాగుంది అని తాను ఈ సినిమా ఖచ్చితంగా చేసి పెడతాను అని, కాకపోతే ఈ సినిమాలో హీరో పాత్ర కేవలం జే డి చక్రవర్తి అయితే మాత్రమే చేస్తా అంటూ చెప్పాడట రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ).కానీ అప్పటికే సీనియర్ నరేష్ కి తను మాట ఇచ్చానని, ఆ మాట తప్పలేను అని తేల్చి చెప్పాడట ధర్మవరపు సుబ్రహ్మణ్యం.కానీ అందుకు ఆర్జీవీ( RGV ) ఒప్పుకోక పోవడం తో ఆ కథను తానే డైరెక్టర్ గా నరేష్ హీరోగా, నివేదిత హీరోయిన్ గా సినిమా తీశాడు ధర్మవరపు.
రాంగోపాల్ వర్మ చాలా కాలం పాటు ఆ సినిమా కథని తల దగ్గరే పెట్టుకుని ధర్మారపు సుబ్రహ్మణ్యాన్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టుగా ఆయన కొడుకు ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ నివేదిత( Heroine Nevedita ) జయం ఆ తర్వాత పిట్ట గోడ పై క్యాట్ వాక్ చేస్తూ కిందపడి కన్ను మూసింది.పిట్టగోడపై నడిస్తే త్వరగా క్యాట్ అవుతుంది అని ఒక నానుడి అప్పట్లో ఉండేది.ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం రెండు సినిమాలకు మాత్రమే డైరెక్షన్ చేశారు ఆ తర్వాత డైరెక్షన్లో ఉండే సాధక బాధకాలు అర్థమై ఆ తర్వాత మళ్లీ ఆ సాహసం చేయలేకపోయారు ఇక నిర్మాణం వైపు మాత్రం పూర్తిగా వినలేదు సినిమా అంటే వట్టి మాట కాదని నటించడం చాలా ఈజీ విషయమని అందుకే డైరెక్షన్, ప్రొడక్షన్ చేయడం తన పని కాదు అని విరమించుకున్నారు.