ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు.రోజు రోజుకు క్యాన్సర్ వలన చనిపోయే వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది.
క్యాన్సర్ వ్యాధి ఎంతో ప్రమాదకరమైనది.మనుషుల ప్రాణాలను తీసేసే ఈ మహమ్మారి నుండి రక్షణ పొందాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలను రోజువారి మెనూలో చేర్చుకోవటం ద్వారా క్యాన్సర్ బారి నుండి తప్పించుకోవచ్చు.
మరి క్యాన్సర్ నుండి రక్షణ పొందే ఆ ఆహార పదార్ధాలు ఏంటో చూద్దామా.పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అందుకే రోజుకు ఒక యాపిల్ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.ఎందుకంటే యాపిల్స్‌లో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి.
ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.
వైద్య నిపుణులు చేసిన పరిశోధనలలో భాగంగా పాలీఫెనాల్స్ క్యాన్సర్ నిరోధక, కణితులతో పోరాడే లక్షణాలను కలిగి ఉన్నట్లు తేలింది.
అలాగే క్యాన్సర్ ను నిరోదించే మరొక అద్భుతమైన పండ్లలో బెర్రీస్ కూడా ఒకటి.వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉండడంతో పాటు యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటాయి.
ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా బ్లాక్ బెర్రీస్ లో ఉండే ఆంథోసైనిన్ అనే సమ్మేళనం పెద్దప్రేగు క్యాన్సర్ ను తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తెలిసింది.
ఇంకా బ్రోకలీ, కాలీఫ్లవర్, వంటి కూరగాయలలో విటమిన్ సి, విటమిన్ K, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి.వీటిల్లో సల్ఫోరాఫేన్ ఎక్కువగా ఉంటుంది.
సల్ఫోరాఫేన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను గణనీయంగా నిరోధిస్తుంది.అలాగే సోయాబీన్స్,క్యారెట్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
క్యారెట్ లో విటమిన్ K, విటమిన్ A వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కాలంగా ఉన్నాయి.

క్యారెట్‌లో అధిక మొత్తంలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో, క్యాన్సర్‌లను నిరోధించడంలో క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.క్యారెట్ లో ఉండే బీటా-కెరోటిన్ రొమ్ము క్యాన్సర్,ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదన్ని తగ్గించడానికి సహాయకారిగా పనిచేస్తుంది.
అలాగే సాల్మన్, మాకేరెల్, ఆంకోవీస్ అనే కొన్ని రకాల కొవ్వు చేపలలో విటమిన్ B, పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.వీటిని తినడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని ఒక అధ్యయనం తేలింది.
చేపల నూనెను తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.క్యాన్సర్ తో పోరాడుతున్న వారు వాల్ నట్స్ ను తినడం వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయి.