ఈ భూమి పై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు కచ్చితంగా మరణించాల్సిందే.కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఇంకా జీవించాలనే కోరిక ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం లాంటివన్నీ దీర్ఘాయువు కోసమే.అయితే చాలా మందికి ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యకర అలవాట్లు( Healthy habits ) పాటించడం కష్టంగా మారుతూ ఉంటుంది.
కానీ సులభంగా వంద సంవత్సరాల ఆయుష్షు కావాలంటే మాత్రం రాత్రి పూట ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు .రాత్రి ఒక నిర్ణీత సమయంలో ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల 100 సంవత్సరాల ఆయుష్షు గ్యారెంటీ అని చెబుతున్నారు.
ఇంతకీ ఆహారం విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రి 7 గంటల లోపల ఆహారం తీసుకుంటే దీర్ఘకాలం జీవించగలుగుతారు.ఈ సమయంలో తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం( Digestive Health ) అవుతుంది.శరీరంలోనీ అవయవాలు పోషకాలను కూడా బాగా గ్రహిస్తాయి.మీ శరీర పని తీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.అలాగే శుద్ధి చేయని కార్బోహైడ్రేట్లు మొక్కల ప్రోటీన్లు, సాధారణ చేపలను తీసుకోవడం వల్ల దీర్ఘాయువు వీలవుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఇవి ఆరోగ్యానికి దివ్యౌషధం పని చేస్తాయి.అలాగే రాత్రి త్వరగా భోజనం చేసేటప్పుడు తక్కువ క్యాలరీలు మొక్కల ఆధారిత ఆహారం( Plant-Based Ingredients ) తీసుకోవడం మంచిది.ఇది దీర్ఘ కాలం పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
దీంతో వంద సంవత్సరాలు జీవించాలని కోరిక కూడా నెరవేరుతుంది.అంతేకాకుండా మనిషికి శరీరక శ్రమ కచ్చితంగా ఉండాలి.
తక్కువ చక్కెర, శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఉదయం పన్నెండు గంటలలోపు తినాలి.
రోజు లో మిగిలిన 12 గంటలు ఉపవాసం ఉండాలి.ఇది దీర్ఘాయుకు గొప్ప సూత్రం అని ఆహార నిపుణులు చెబుతున్నారు.