ఎటువంటి క్రీమ్స్ అక్కర్లేదు.. ఈ చిట్కాను పాటిస్తే సూపర్ గ్లోయింగ్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం!

ఎటువంటి మచ్చలు లేకుండా తమ ముఖ చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు అటువంటి స్కిన్ కోసం తహతహలాడుతుంటారు.

 Follow This Tip For Super Glowing And Spotless Skin! Glowing Skin, Spotless Skin-TeluguStop.com

ఈ క్రమంలోనే ఖరీదైన ఫేస్ క్రీములు వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే క్రీముల వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా మాత్రం మీ చర్మానికి ఒక వరం అని చెప్పుకోవచ్చు.ఈ చిట్కాను పాటిస్తే సూపర్ గ్లోయింగ్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Telugu Tips, Face Pack, Tipspotless, Remedy, Skin Care, Skin Care Tips, Spotless

అందుకోసం ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో చేతినిండా పుదీనా ఆకులు ( Mint leaves )మరియు చేతినిండా వేపాకులు వేసుకుని పావు కప్పు రోజ్ వాటర్ ( Rose water )పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి ( Sandalwood powder )వేసుకోవాలి.అలాగే హాఫ్‌ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ బాదం నూనె, హాఫ్‌ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా పుదీనా-వేపాకు జ్యూస్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Face Pack, Tipspotless, Remedy, Skin Care, Skin Care Tips, Spotless

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై తడి క్లాత్ సహాయంతో వేసుకున్న ప్యాక్ ను తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.వారానికి రెండంటే రెండు సార్లు ఈ సింపుల్ ఇంటి చిట్కాను కనుక పాటిస్తే చ‌ర్మంపై ఎంతటి ముదురు రంగు మచ్చలు ఉన్న తగ్గుముఖం పడతాయి.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.

మొటిమల బెడద తగ్గుతుంది.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే చర్మం సూపర్ గ్లోయింగ్ గా మరియు షైనీ గా మెరిసిపోతుంది.

కాబట్టి మచ్చలేని అందమైన మెరిసే చర్మం కోసం తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube