1 .ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సంచలన వ్యకల్యాలు చేశారు.సెటిలర్స్ కారణంగా ఇక్కడ ప్రజలకు ఏమి ఉపయోగం లేదని, అభివృద్ధి చోటుచేసుకోవడం లేదని రాజన్నదొర వ్యాఖ్యానించారు.
2 .స్వర్ణదేవాలయం వద్ద రెండో పేలుడు
పంజాబ్ లోని అమృతసర్ స్వర్ణ దేవాలయం వద్ద రెండో పేలుడు సంభవించింది.
౩ .R 5 జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
4 .ఛత్తీస్ ఘడ్ లో ఎన్కౌంటర్
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్కౌంటర్ జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టు లు మృతి చెందారు.
5 .ఆర్టీసీ బస్సులు ప్రయాణించిన రాహుల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ( Rahul gandhi ) మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు.
6.కెసిఆర్ పీఎం కావాలని జనాలు కోరుకుంటున్నారు
టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి ( Malla Reddy )అన్నారు.
7.కేరళ బోటు ప్రమాదం బాధితులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియ
కేరళలోని మలపురం జిల్లాలో తాండూర్ తీరంలో పర్యాటకుల బోటు బోల్తా పడింది ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందారు వీరికి కేరళ ప్రభుత్వం ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
8.ఉచిత వ్యవసాయ భీమా ఓ బూటకం
ఉచిత వ్యవసాయ భీమా ఓ కబూటకమని టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.
9.ఎస్బిఐలో దోపిడీకి కి ప్రయత్నం
అనకాపల్లి జిల్లాలోని రాంపల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో దోపిడీకి దొంగలు ప్రయత్నించారు.మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
10.సుప్రీంకోర్టుకు అమరావతి రైతులు
అమరావతి రాజధాని ఆర్ 5 జోన్ విషయంలో సుప్రీం కోర్టులో అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అమరావతి రైతులు పిటిషన్ లో పేర్కొన్నారు.
11.పులుల కోసం కొనసాగుతున్న గాలింపు
గుంటూరు జిల్లాలో పులుల కోసం గాలింపు కొనసాగుతోంది 15 రోజులపాటు గాలిస్తామని అధికారులు తెలిపారు.
12.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికి 93 రోజులకు చేరుకుంది.
13.ప్రియాంక గాంధీ పర్యటన
నేడు హైదరాబాదులో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ సరూర్ నగర్ మైదానంలో జరిగే యువ సంఘర్షణ సభలో పాల్గొంటారు.
14.కేటీఆర్ పర్యటన
నేడు హైదరాబాద్ బెల్లంపల్లిలో కేటీఆర్ పర్యటించనున్నారు.
15.బట్టి విక్రమార్క పాదయాత్ర
రంగారెడ్డి జిల్లాలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది.
16.తెలంగాణకు భారీ వర్ష సూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
17.13వ రోజు కొనసాగుతున్న జల దీక్ష
నేడు నంద్యాల జిల్లాలోని జూపాడు మాండ్లెం లో 13వ రోజు జల దీక్ష కొనసాగుతోంది.
18.సోనియా గాంధీ పై ఈసీకి బిజెపి ఫిర్యాదు
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ( Sonia Gandhi )చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
19.ఢిల్లీ లిక్కర్స్ స్కాం
ఢిల్లీ లెక్క ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్ చంద్ర రెడ్డికి బెయిల్ లభించింది.
20.కేటీఆర్ కు షర్మిల కౌంటర్
మంత్రి కేటీఆర్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.గ్రూప్ వన్ పరీక్షలు రాయొద్దని ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా అని షర్మిల ప్రశ్నించారు.