పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సినిమా ఏదనే ప్రశ్నకు సందేహం అవసరం లేకుండా ఓజీ సినిమా( OG Movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.దేవర మూవీ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఓజీ సినిమా హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.
ఓజీ సినిమా ఏపీ హక్కులు 70 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని భోగట్టా.
దేవర సినిమాతో పోల్చి చూస్తే ఏపీ హక్కులు ఏకంగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
నైజాం ఓజీ డీల్ 46 కోట్ల రూపాయలు అని సమాచారం.సీడెడ్ ఏరియా హక్కులు సైతం భారీ రేటుకు అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంది.
ఓజీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్( OG Pre-Release Business ) విషయంలో నిర్మాత సంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది.పవన్ సినిమాకు టికెట్ రేట్లు( Ticket Rates ) సైతం భారీ స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు.

2025 మార్చి నెలలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ సిన్మా రైట్స్ కోసం ఉన్న డిమాండ్ చూసి అభిమానులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఓజీ మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.

ఓజీ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని కామంట్లు వినిపిస్తున్నాయి.ఓజీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.పవన్ కళ్యాణ్ మరో 15 రోజుల పాటు షూట్ లో పాల్గొంటే ఈ సినిమా షూట్ పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి.పవన్ తర్వాత సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది.
పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఓజీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.