సాధారణంగా సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు అలాంటి సన్నివేశాల్లో నటించడానికి హీరోలు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.కానీ కొంతమంది హీరోలు మాత్రం తమకు నచ్చిన హీరోయిన్లను ఏరికోరి మరీ తమ సినిమాల్లో పెట్టుకుంటూ ఉంటారు.
ఇక ఆ హీరోయిన్ పై మరింత ప్రేమ ఉంటే కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండాలంటూ డైరెక్టర్ను రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటారు అంటూ టాక్ కూడా ఉంది.ఇక్కడో ఒక హీరో కూడా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్లలో పదేపదే నటించేందుకు ఆమెని కౌగిలించుకునేందుకు కోట్లు తీసుకున్నాడట.
ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా నిజంగానే జరిగిందట.
ఇక హీరో ఇలా చేయడానికి కెమెరామెన్ తో కాస్త ఒప్పందం కుదుర్చుకుని.
కావాలనే సీన్స్ సరిగా రాలేదని ఎక్కువ టేక్స్ తీసుకొనేవాడట.ఇండియన్ క్లాసిక్ మూవీ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న షోలే సినిమా సమయంలో ఇక ఇలాంటివి గాసిప్ గట్టిగా వినిపించింది.
హీరోగా ఉన్న ధర్మేంద్ర హేమమాలిని తో రొమాంటిక్ సన్నివేశాల్లో కాస్త చిలిపి పనిచేశారట.అప్పటికి హేమమాలిని ధర్మేంద్ర ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు.అయినప్పటికీ హేమమాలినిపై ధర్మేంద్ర కు ప్రేమ మాత్రం తగ్గలేదు.
అయితే షోలే సినిమాలో ఇద్దరు కలిసి నటించారు.అయితే ఇక ముందుగానే కెమెరా మెన్, లైట్ బాయ్ చెప్పి.
పదే పదే రొమాంటిక్ సీన్ ఎక్కువ టేకులు తీసుకునేలా చేసేవాడట ధర్మేంద్ర.
ఇక ఇలా స్పాట్ బాయ్ తనకు సహకరించినందుకు ఏకంగా రెండు వేల రూపాయల వరకు ఇచ్చేవాడట.ఇలా హేమమాలిని కౌగిలించుకోవడం కోసం ధర్మేంద్ర చేసిన చిలిపి పని అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత కాలంలో హేమమాలిని ధర్మేంద్ర భార్య గా మారిపోయింది.
ఇక ధర్మేంద్ర హేమమాలిని పెళ్లి కూడా అప్పట్లో ఒక సంచలనమే అని చెప్పాలి.అయితే ధర్మేంద్ర హేమమాలిని బంధాన్ని ఇక మొదటి భార్య అంగీకరించేవారు కాదట.
వారి పిల్లలు కూడా ధర్మేంద్ర హేమమాలిని పెళ్లి చేసుకోవటాన్ని తప్పు పట్టారట.అయితే ఇక రెండు కుటుంబాల విషయంలో అటు ధర్మేంద్ర కూడా కాస్త కఠినంగానే ఉండేవాడట.