ఒక హీరో ఒక దర్శకుడు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయిందంటే మురిసిపోతారు.అదే హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే అభిమానుల్లో ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే ఇలా ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది జూలై నెలలో కూడా మరో రెండు హిట్ కాంబినేషన్ రిపీట్ అయి ప్రేక్షకులను అలరించి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి అన్నది తెలుస్తుంది.ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
విక్రమ్ కుమార్ – నాగచైతన్య : 2004 లో అక్కినేని ఫ్యామిలీ కథ కుటుంబ చిత్రమైన మనం అనే సినిమాను తెరకెక్కించాడు విక్రమ్ కుమార్. దాదాపు అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కూడా ఈ సినిమాలో కవర్ చేశాడు అని చెప్పాలి.
ఇక ఇప్పుడు అక్కినేని హీరో నాగచైతన్య తో కలిసి ఒక సినిమాకు సిద్దమయ్యాడు.విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన థాంక్యూ జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది జూలై 8 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఇక మన తో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ సినిమాతో హిట్ కొడుతుందో చూడాలి.

అదే సమయంలో నిఖిల్ సిద్ధార్థ్ కెరియర్ లోనే మంచి విజయాన్ని సాధించిన చిత్రం కార్తికేయ. 2014లో జులై 1 న విడుదలైంది.ఈ సినిమా లో మొదటిసారి దర్శకుడు చందు మొండేటి హీరో నిఖిల్ సిద్దార్థ్ కలిసి పనిచేశారు ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రిపీట్ కాలేదు.
ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత కార్తికేయ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదలైంది ఈ సినిమా జులై 22వ తేదీన జరుగుతుంది అన్నది తెలుస్తుంది.







