ముఖ చర్మం ఎంత తెల్లగా ఉన్నా మృదువుగా ఉన్నా అక్కడక్కడ కనిపించే నల్లటి మచ్చలు( Dark Spots ) అందం మొత్తాన్ని మరియు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి.ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.
అయితే వాటిని తగ్గించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా మన దగ్గరుండే వాసెలిన్ తో( Vaseline ) చాలా ఈజీగా నల్ల మచ్చలకు బై బై చెప్పవచ్చు.
మరి ఇంతకీ చర్మానికి వాసెలిన్ ను ఏ విధంగా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloevera Gel ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) మరియు వన్ టీ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఒక మంచి క్రీమ్ అనేది రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను చర్మానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ప్రతిరోజు నైట్ ఈ క్రీమ్ ను ఉపయోగించడం వల్ల అదిరిపోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.ఈ న్యాచురల్ క్రీమ్ నల్ల మచ్చలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.క్రమంగా వాటిని మాయం చేస్తుంది.
స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.అలాగే ఈ హోమ్ మేడ్ క్రీమ్ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది.
ఒకవేళ ముడతలు ఆల్రెడీ ఉంటే వాటిని తగ్గించి చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి మచ్చలేని మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న విధంగా వాసెలిన్ తో ఫేస్ క్రీమ్ తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.