సాధారణంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది స్కిన్ టోన్‌ను పెంచుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే క్రీములు, లోషన్లు, సీరమ్లపై ఆధారపడుతున్నారు.ఈ క్రమంలోనే వాటి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
అయినప్పటికీ ఫలితం మాత్రం పెద్దగా ఉండదు.అయితే స్కిన్ టోన్‌ను పెంచేందుకు కలోంజి సీడ్స్ అద్భుతంగా సహాయపడతాయి.
ఉల్లి, మిరియాల రుచిని తలపించే కలోంజి సీడ్స్‌ను భారతీయులు వంటల్లో విరి విరిగా వాడుతుంటారు.
వంటలకు చక్కటి రుచిని అందించి కలోంజి సీడ్స్‌లో బోలెడన్ని పోషక విలువలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా కలోంజి సీడ్స్ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా స్కిన్ టోన్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి కలోంజి సీడ్స్ సూపర్‌గా హెల్ప్ చేస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం కలోంజి సీడ్స్‌ను చర్మానికి ఎలా వాడాలో చూసేయండి.

ముందుగా కొన్ని కలోంజి సీడ్స్‌ను తీసుకుని లైట్‌గా డ్రై రోస్ట్ చేసి మెత్తగా పిండి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కలోంజి సీడ్స్ పౌడర్, ఒక స్పూన్ అలోవెర జెల్, నాలుగు స్పూన్ల వెన్న తీసిన పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒక సారి ఈ ప్యాక్‌ను వేసుకుంటే స్కిన్ టోన్ మెరుగ్గా మారడమే కాదు కాంతి వంతంగా మరియు మృదువుగా మారుతుంది.
అలాగే చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ కలోంజి సీడ్స్ పౌడర్, ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు స్పూన్ల తేనె వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల కూడా స్కిన్ టోన్ పెరుగుతుంది.
అదే సమయంలో మొటిమలు, నల్ల మచ్చలు తగ్గు ముఖం పడతాయి.