నిర్జీవంగా ఉన్న జుట్టును ఒక్క వాష్ లోనే సూపర్ సిల్కీగా అండ్ షైనీ గా మార్చుకోండిలా!

వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం, కురుల సంరక్షణ లేకపోవడం, హెయిర్ ఆయిల్ ను ఎవైడ్ చేయడం తదితర కారణాల వల్ల ఒక్కోసారి జుట్టు నిర్జీవంగా ఎండు గడ్డిలా మారుతుంటుంది.ఇలాంటి జుట్టుతో బయటకు వెళ్లాలంటే చాలా మంది అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

 This Remedy Makes Your Hair Super Silky And Shiny In Just One Wash! Silky Hair,-TeluguStop.com

ఈ క్రమంలోనే నిర్జీవంగా మారిన జుట్టును రిపేర్ చేసుకునేందుకు వేలకు వేలు ఖర్చుపెట్టి హెయిర్ స్పా ట్రీట్మెంట్ తీసుకుంటారు.

అయితే ఇందుకోసం ప్రత్యేకంగా స్పాలకే వెళ్ళాలని లేదు.

నిజానికి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే నిర్జీవంగా మారిన జుట్టును రిపేర్ చేసుకోవచ్చు.అది కూడా ఒక్క వాష్ లోనే.

అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Care, Care Tips, Fall, Pack, Remedy, Shiny, Silky, Smooth-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), ఒక కప్పు కొబ్బరి పాలు వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న మెంతులను కొబ్బరిపాల( Coconut Milk )తో సహా వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe Vera Gel )వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Remedy, Shiny, Silky, Smooth-Telugu Health

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా చేస్తే ఎండు గడ్డిలా మారిన జుట్టు ఒక్క వాష్ కే సూపర్ సిల్కీగా, స్మూత్ గా మరియు షైనీ గా మారుతుంది.

నిర్జీవంగా ఉన్న జుట్టును రిపేర్ చేయడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా హెయిర్ గ్రోత్ ను పెంచడానికి, హెయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి కూడా ఈ రెమెడీని ఉప‌యోగించ‌వ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube