రక్తంలో హిమోగ్లోబిన్ ఎంత అవసరమో కొత్తగా చెప్పనక్కరలేదు.ఆ హేమోగ్లిబిన్ తయారు కావడానికి ఐరన్ ఎంత అవసరమో కూడా కొత్తగా చెప్పనక్కరలేదు.
ఒంట్లో ఐరన్ శాతం లేకపోతె దాన్నే అనేమియా అని అంటారు.సాధారణ భాషలో చెప్పాలంటే దాన్నే రక్తహీనత అని అంటారు.
ఈ సమస్యతో ఎంతోమంది, ముఖ్యంగా స్త్రీలు బాధపడుతుంటారు.వీరికి ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది.
ఆ అవసరం బెల్లం తీర్చగలదు.బెల్లంలో చిక్పీస్ మరియు అల్లం కలుపుకొని తింటే రక్తహీనత నుంచి విముక్తి పొందవచ్చు.
ఎలానో ? ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
రెండు టీస్పూనుల బెల్లం తీసుకొని, అల్లం పౌడర్ ఓ టీస్పూనులో తీసుకొని, కాస్తంత పెప్పర్ తీసుకొని, మూడిటిని బాగా కలిపి మూడు పూటలా కడుపులోకి వేసుకోండి.
దీన్ని ఒక దినచర్యగా మార్చుకుంటే మీ సమస్య తీరినట్టే.
చిక్పీస్ ని నీళ్ళలో నానబెట్టి, రాత్రంత అలానే ఉంచండి.తెల్లారి చిక్పీస్ లోకి రెండు ముక్కాల బెల్లం కలిపి, పరకడపున తినండి.ఇలా రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఎందుకంటే ఇటు బెల్లంలో, అటు చిక్పీస్ లో ఐరన్ కంటెంట్ బాగా లభిస్తుంది.